న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

233 సంవత్సరాలలో తొలిసారి.. ఎంసీసీ పీఠంను అధిష్టించనున్న మహిళ!!

Clare Connor set to become first female president of MCC in its 233-year history

లండన్‌: క్రికెట్ నిబంధనల తయారీ సంస్థ మెర్ల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రారంభమై ఇప్పటికి 233 సంవత్సరాలైంది. ఇన్నేళ్ల తరువాత ఎంసీసీ క్లబ్ ఓ కొత్త చరిత్రను లిఖించబోతోంది. ఎంసీసీ అధ్యక్ష పదవిని తొలిసారిగా ఒక మహిళ అధిష్టించబోతున్నారు. ఆమె.. ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర వచ్చే ఏడాది పదవి నుంచి దిగిపోయిన తర్వాత కానర్‌ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎంసీసీ పీఠంపై తొలిసారి మహిళ

ఎంసీసీ పీఠంపై తొలిసారి మహిళ

ఎంసీసీ లండన్ కేంద్రంగా ఉన్న ఒక క్రికెట్ క్లబ్. దీనిని 1787లో స్థాపించారు. ఈ క్లబ్ ఏర్పడి ఇప్పటికి 233 సంవత్సరాలు అయ్యింది. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ క్లబ్‌కు మొదటిసారి ఒక మహిళను అధ్యక్షురాలుగా చేస్తున్నారు. అయితే క్లేర్ కానర్ ఈ పదవిలో రావటానికి ఏడాదికి పైగా వేచి ఉండాలి. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న‌ కుమార సంగక్కర స్థానంలో కానర్ వచ్చే ఏడాది అక్టోబర్‌ నెలలో నియమితులవుతారు.

సంగక్కరనే ప్రతిపాదించడం విశేషం

సంగక్కరనే ప్రతిపాదించడం విశేషం

కుమార సంగక్కర స్వయంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లో మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న క్లేర్ కానర్‌ను నామినేట్ చేసారు. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో.. కానర్ ఎంసీసీ అధ్యక్ష పదవిని చేపడుతారని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 1న కానర్ ఈ పదవిని చేపట్టనున్నారు. అయితే దీనికి ముందు ఆమె మెర్ల్‌బోన్‌ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.

16 టెస్టులు, 93 వన్డేలకు ప్రాతినిధ్యం:

16 టెస్టులు, 93 వన్డేలకు ప్రాతినిధ్యం:

ఎంసీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం ఈ సంవత్సరంతో ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంగక్కర పదవీకాలం ఏడాది పాటు పొడిగించబడింది. 'క్లేర్ కానర్ తదుపరి ఎంసీసీ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు ఈ గౌరవం కూడా పెద్ద విషయం' అని సంగక్కర పేర్కొన్నారు. ఎంసీసీ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా ఉందని కానర్ ఒక ప్రకటనలో తెలిపారు. కానర్ 1995-2005 మధ్య 16 టెస్టులు, 93 వన్డేలలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అది ముమ్మాటికీ పొరపాటే.. క్షమాపణలు కోరుతున్నా: స్టార్ ప్లేయర్

Story first published: Friday, June 26, 2020, 15:17 [IST]
Other articles published on Jun 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X