న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అది ముమ్మాటికీ పొరపాటే.. క్షమాపణలు కోరుతున్నా: స్టార్ ప్లేయర్

Dominic Thiem apologises for players Adria Tour antics

బెల్‌గ్రేడ్‌: ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్న టాప్‌ టెన్నిస్ ఆటగాళ్లు గ్రిగోర్ దిమిత్రోవ్‌ (బల్గేరియా), బోర్నా కోరిచ్‌ (క్రొయేషియా), విక్టర్‌ ట్రయోకి (సెర్బియా) కరోనా బారిన పడడంతో ఈవెంట్‌ నిర్వాహకుడు అయిన నొవాక్ జొకోవిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిర్లక్ష్యం చేస్తూ.. ఎలాంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా ఆటగాళ్లకు వైరస్‌ సోకడంలో జొకో పరోక్షంగా కారకుడయ్యాడంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.

టోర్నీ కారణంగా వైరస్ బారినపడిన వారికి జొకోవిచ్‌ క్షమాపణలు చెప్పగా.. టోర్నీలో పాల్గొన్న డొమినిక్‌ థీమ్ (ఆస్ట్రియా)‌ తమ ప్రవర్తన తప్పేనని పేర్కొన్నాడు. 'నోవాక్ జకోవిచ్‌తో సహా ఆడ్రియా టూర్‌లో ఆడిన నలుగురు ఆటగాళ్లకు కరోనా సోకిందని తెలిసి షాక్‌కు గురయ్యా. ఆ టోర్నీకి ముందు కొన్ని వారాలుగా ఖాళీ స్టేడియాల్లో ఆడాం. దాంతో ఆ టోర్నీకి అభిమానులు హాజరుకావడంతో ఆనందపడ్డాం. సెర్బియా ప్రభుత్వ నిబంధనలను గట్టిగ నమ్మాం' అని థీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

'ఎంతో ఆశాజనకంగా ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీలో బరిలో దిగాం. కానీ మేం తప్పుగా ప్రవర్తించాం. టోర్నీ జరిగినపుడు భౌతిక దూరం నిబంధనలు మరిచి ప్రవర్తించడం సరికాదు. మేం మితిమీరిన ఉత్సాహం ప్రదర్శించాం. అది ముమ్మాటికీ పొరపాటే. దానికి క్షమాపణలు కోరుతున్నా. గత పది రోజుల్లో అయిదుసార్లు వైరస్‌ పరీక్షలు జరిపించుకోగా.. నెగెటివ్‌గానే తేలింది. వైరస్‌ బారిన పడ్డ ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని థీమ్‌ పేర్కొన్నాడు.

అంతకుముందు జొకోవిచ్‌ క్షమాపణలు చెప్పాడు. 'సెర్బియాలో వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు నాతో పాటు నా భార్యకి కూడా కరోనా సోకింది. సంతోషకర విషయం ఏంటంటే.. నా పిల్లలకి మాత్రం నెగటివ్‌గా తేలింది. టోర్నీ కారణంగా వైరస్ బారినపడిన వారిని క్షమాపణలు కోరుతున్నా' అని అన్నాడు. వైరస్ సోకిన జొకోవిచ్‌, అతని భార్య ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు.

టోర్నీ నిర్వహణ ఓ తెలివి తక్కువ పనంటూ నెటిజన్లు జకోవిచ్‌ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జకోవిచ్‌ను అతని తల్లిదండ్రులు వెనకేసుకొచ్చారు. వైరస్‌ వ్యాప్తికి దిమిత్రోవ్‌ కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 'కేవలం జకోవిచ్‌ వల్లే ఇలా జరిగిందా?. దిమిత్రోవ్‌ అనారోగ్యంతోనే టోర్నీకి వచ్చాడేమో? ఎవరికి తెలుసు. అతను ఎక్కడో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అతను క్రొయేషియాతో పాటు సెర్బియాలోని మా కుటుంబానికి నష్టాన్ని అంటగట్టాలని చూస్తున్నాడు' అని జకోవిచ్‌ తండ్రి సర్జాన్‌ అన్నారు.

పాక్ అభిమాని దూషించినా.. ఏం చేయలేకపోయా: విజయ్పాక్ అభిమాని దూషించినా.. ఏం చేయలేకపోయా: విజయ్

Story first published: Friday, June 26, 2020, 14:30 [IST]
Other articles published on Jun 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X