న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు.. 45 ఏళ్ల వరకు ఆడాలనుంది'

Pakistan drop Mohammad Hafeez, Shoaib Malik for Sri Lanka series

గయానా: క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు. 45 అనేది మంచి సంఖ్య. 45 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడాలనుంది అని వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ అంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే ఈ విషయాన్ని మాత్రం సెలెక్టర్లకే వదిలేస్తున్నా గేల్‌ చెప్పుకొచ్చాడు. యూనివర్స్‌ బాస్‌ మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో రిటరయ్యే ఆలోచన లేదని తెలుస్తోంది.

<strong>ఒకే ఒక్క పరుగు.. మరో ప్రపంచ రికార్డు బ్రేక్ చేయనున్న కోహ్లీ!!</strong>ఒకే ఒక్క పరుగు.. మరో ప్రపంచ రికార్డు బ్రేక్ చేయనున్న కోహ్లీ!!

యవ్వనంగా మారుతున్నా

యవ్వనంగా మారుతున్నా

2019 చివరి వరకు విరామం తీసుకున్న గేల్‌.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఛటోగ్రామ్ ఛాలెంజర్స్‌ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ సందర్భంగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో ముఖాముఖిలో పాల్గొన్నాడు. 'ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఎందుకంటే ఆటకు నేను చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. అందుకు నా శరీరం కూడా సహకరిస్తుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నా. రోజులు గడిచేకొద్ది నేను యవ్వనంగా మారుతున్నా' అని గేల్‌ అన్నాడు.

45 ఏళ్ల వరకు ఆడితే బాగుంటుంది

45 ఏళ్ల వరకు ఆడితే బాగుంటుంది

గేల్‌ తన రిటైర్మెంట్‌పై కూడా వివరణ ఇచ్చాడు. 'నేను ఆడితే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. నాక్కూడా క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు. 45 అనేది మంచి సంఖ్య. 45 ఏళ్ల వరకు కొనసాగితే బాగుంటుంది. నాకు ఆటపట్ల ప్రేమ, అభిరుచి, అంకితభావం ఉన్నాయి. వీలైనంత కాలం కొనసాగడానికి ప్రయత్నిస్తా' అని యూనివర్స్‌ బాస్‌ తెలిపాడు.

టీ20 ప్రపంచకప్‌ ఆడుతా

టీ20 ప్రపంచకప్‌ ఆడుతా

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టాడు. 'టీ20 ప్రపంచకప్‌లో ఆడితే బాగుంటుంది. అందుకు నాకు తలుపులు తెరిచి ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందో వేచి చూడాలి. నా కన్నా కొంత మంది ప్రతిభగల యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ విషయాన్ని సెలెక్టర్లకే వదిలేస్తున్నా' అని గేల్‌ చెప్పుకొచ్చాడు.

తాత్కాలిక విరామం

తాత్కాలిక విరామం

గతేడాది నవంబర్ నెలలో గేల్‌ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ విషయాన్ని గేల్‌ వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు తెలియజేశాడు. నవంబర్ నుండి ఏ టోర్నీలో ఆడబోనని గేల్‌ స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లకు కూడా అందుబాటులో ఉండనని పేర్కొన్నాడు.

Story first published: Friday, January 10, 2020, 10:27 [IST]
Other articles published on Jan 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X