న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్ కథ ఇంకా ముగియలేదు బాస్: ఐపీఎల్‌లో మళ్లీ యూనివర్సల్ బాస్ మెరుపులు చూడబోతున్నాం

Chris Gayle has hinted at his comeback to the IPL 2023, posted videos of his workout session on Insta

కింగ్‌స్టన్: టీ20, ఐపీఎల్ ఫార్మట్ స్పెషలిస్ట్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. మళ్లీ దర్శనం ఇవ్వబోతున్నాడు. గ్రౌండ్‌లో తనదైన శైలిలో మెరుపులు మెరిపించడానికి సన్నద్ధమౌతున్నాడు. క్రిస్ గేల్ గైర్హాజరీలో కొనసాగుతున్న సీజన్ ఇది. ఈ సీజన్‌లో అతను కనీసం మెగా వేలంపాటలో తన పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు. దీనితో అతని కేరీర్ ముగిసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మెగా ఆక్షన్ సందర్భంగా తనను ఎవరూ కొనుగోలు చేయరనే కారణంతోనే తన పేరును నమోదు చేసుకోలేదనే వాదనలు వినిపించాయి.

వచ్చే సంవత్సరం ఐపీఎల్ కోసం..

వచ్చే సంవత్సరం ఐపీఎల్ కోసం..

వాటన్నింటినీ పటాపంచలు చేయనున్నాడీ యూనివర్సల్ బాస్. ఐపీఎల్‌లో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి కసరత్తు చేస్తోన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్, 16వ ఎడిషన్ నాటికి వేలంపాటకు అందుబాటులో ఉండేలా తనను తాను తీర్చిదిద్దుకుంటోన్నాడు. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను క్రిస్ గేల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి అతనిచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో రీఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడని స్పష్టం చేసింది.

వర్కవుట్ వీడియో..

వర్కవుట్ వీడియో..

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో- వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో ఇన్ ప్రిపరేషన్స్ ఫర్ ఐపీఎల్ నెక్స్ట్ ఇయర్.. అనే క్యాప్షన్‌ను ఆ వీడియోకు జత చేశాడు. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇదివరకు క్రిస్ గేల్.. కోల్‌కత నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఈ సంవత్సరం మొత్తంగా దూరం అయ్యాడు. మెగా ఆక్షన్‌లో తన పేరును కూడా నమోదు చేయించుకోలేకపోయాడు.

బీపీఎల్‌లో చివరిసారిగా..

క్రిస్ గేల్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడాడు. చివరి సారిగా కిందటి నెల 18వ తేదీన చివరిసారిగా టీ20 మ్యాచ్‌లో కనిపించాడు. అంతకుముందు వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ చివరిది. ఐపీఎల్‌లో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి 42 సంవత్సరాల వయస్సులో ఎక్సర్‌సైజ్ చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోన్నాడు.

చెక్కు చెదరని రికార్డ్..

చెక్కు చెదరని రికార్డ్..

ఐపీఎల్‌ టోర్నమెంట్లల్లో క్రిస్ గేల్ ఇప్పటిదాకా 142 మ్యాచ్‌లు ఆడాడు. 148.96 స్ట్రైక్ రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. మరో 31 అర్ధసెంచరీలు బాదిపడేశాడీ కరేబియన్ వీరుడు. పార్ట్‌టైమ్ బౌలింగ్ చేస్తూ 18 వికెట్లు తీసుకున్నాడు. 2013 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన క్రిస్ గేల్.. సుడిగాలి ఇన్నింగ్‌ను ఇప్పటికీ ఎవరూ విస్మరించట్లేదు. పుణె వారియర్స్‌పై జరిగిన ఆ మ్యాచ్‌లో 175 పరుగులు చేశాడు. దీన్ని కొట్టే బ్యాటర్ మరొకరు సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు. ఆ మ్యాచ్‌లో 17 సిక్సులు బాదిపడేశాడు.

Story first published: Wednesday, March 30, 2022, 15:53 [IST]
Other articles published on Mar 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X