న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ జట్టులో స్థానం దక్కడంతో ఊపేస్తానంటున్న టీమిండియా నయా వాల్ పుజారా

Cheteshwar Pujara is happy to be in the Test squad, and says will contribute for Teamindia exceptionallay

భారత మిడిలార్డర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా తిరిగి టీమిండియా టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 34ఏళ్ల పుజారా తన రీఎంట్రీలో మంచి ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నాడు. జులై 1 నుంచి 5వరకు ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న అయిదో రీషెడ్యూల్డ్ టెస్ట్ కోసం బీసీసీఐ 17మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పుజారా కూడా చోటు దక్కించుకున్నాడు. ఒక దశాబ్ద కాలంగా భారత టెస్ట్ బ్యాటింగ్ లైనప్‌లో కీలకమైన బ్యాటర్‌గా పుజారా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్, తదితర మ్యాచ్‌లలో తీవ్రంగా పుజారా విఫమయ్యాడు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కూడా అతను ఎంపికకాలేదు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ షిప్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో సెలెక్టర్లు పుజారాను పక్కనపెట్టలేకపోయారు. టీమిండియా నయా వాల్ ఇప్పటివరకు కౌంటీ ఛాంపియన్ షిప్‌లో ససెక్స్ తరఫున కేవలం ఐదు గేమ్‌లలో 720 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. వాటిలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఇంగ్లాండ్‌తో జరగబోయే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో పుజారా తన బ్యాట్‌ కు పని చెప్పాలని చూస్తున్నాడు. 'నేను ఇంగ్లాండ్ టెస్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషిస్తున్నా. ఇటీవల కౌంటీ ఛాంపియన్ షిప్‌లో నా ప్రదర్శనలకు గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. కౌంటీ ఛాంపియన్ షిప్ వల్ల ఇంగ్లాండులో కొంత టైం గడిపినందున.. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కి నేను ఇంకాస్త బెటర్ ప్రదర్శన చేయొచ్చని నమ్ముతున్నానని పుజారా పేర్కొన్నాడు.

'ఎప్పటిలాగే నేను ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బాగా సిద్ధం కావాలని, సరైన శిక్షణ పొందాలని ఎదురు చూస్తున్నాను. భారత జట్టుకు నా బ్యాటింగ్ వల్ల సహకారం కొనసాగించాలని ఆశిస్తున్నా' అని పుజరా పేర్కొన్నాడు. ఇకపోతే రీషెడ్యూల్ చేసిన మ్యాచ్ 2021లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్. కోవిడ్-19 కేసులు వెలుగుచూడడంతో ఐదో టెస్ట్ జరగలేదు. అయినప్పటికీ టీమిండియా ఆ సిరీస్‌ను 2-1ఆధిక్యంతో ముగించింది. రాబోయే గేమ్‌లో విజయం సాధించినా, డ్రా చేసినా టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇక కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ వల్ల ఇంగ్లాండ్ జట్టు మరింత పటిష్ఠ వ్యూహంతో కనబడుతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా విపరీతమైన ఫామ్‌లో ఉన్నందున తుది జట్టులో తప్పక ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లాంటి బౌలింగ్‌ను ఎదురుకోవాలంటే పుజారా లాంటి వాల్ ప్లేయర్లు ఉండాల్సిందే.

Story first published: Monday, May 23, 2022, 11:20 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X