న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్.. తొలి టెస్టులోనే తానేంటో చూపిస్తాడు: పూజారా

Cheteshwar Pujara Backs Clever Ravichandran Ashwin To Make Impact In Australia

అడిలైడ్‌: ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 తర్వాత జరగనున్న సిసలైన సిరీస్ టెస్టు ఫార్మాట్‌లో గెలిచేందుకు టీమిండియా భారీగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో గురువారం అడిలైడ్‌లో జరగనున్న తొలి టెస్టు‌లో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సత్తాచాటుతాడని ఛతేశ్వర్‌ పుజారా అన్నాడు. ఈ సిరీస్‌లో అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటన చేసినప్పుడు నమోదైన చెత్త రికార్డులన్నిటినీ చెరిపేయడానికి అశ్విన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడని అన్నాడు.

 ఆసీస్‌ గడ్డపై కాస్త పేలవంగానే

ఆసీస్‌ గడ్డపై కాస్త పేలవంగానే

సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పుజారా మాట్లాడాడు. అశ్విన్ ఆస్ట్రేలియాలో ఆడిన 6 టెస్టుల్లో 54.71 సగటుతో 21వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అతడు తన కెరీర్లో 25.44 సగటుతో 336 వికెట్లు పడగొట్టాడు. దీంతో పోలిస్తే ఆసీస్‌ గడ్డపై అతని ప్రదర్శన కాస్త పేలవంగానే ఉందని తెలుస్తోంది.

అశ్విన్‌ బౌలింగ్‌లో చాలా మార్పులు

‘ఈ మధ్య కాలంలో అశ్విన్‌ బౌలింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని వివరించలేను, కానీ ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు అవసరమైన అడ్జస్ట్‌మెంట్స్‌ అతడు చేసుకుంటున్నాడు. దీనికి కావాల్సినంత ప్రాక్టీస్‌ మాకు లభించింది. సోమవారం విశ్రాంతి తీసుకుని, మిగిలిన రెండు రోజులు సాధన చేయాలనుకుంటున్నాం' అని పుజారా పేర్కొన్నాడు.

చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేని బౌలర్లు

చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేని బౌలర్లు

డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్‌లను రెండు జట్లూ ఆడనున్నాయి. ఈ క్రమంలో తొలి టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా ఎలెవన్‌తో కలిసి ఆడింది టీమిండియా. డ్రాగా ముగిసిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించగా.. బౌలర్లు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.

పేలవ ప్రదర్శనతో రవిచంద్రన్ అశ్విన్ (2/122)

పేలవ ప్రదర్శనతో రవిచంద్రన్ అశ్విన్ (2/122)

ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (2/122) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. అతని బౌలింగ్‌ని సమర్థంగా ఎదుర్కొన్న ఎలెవన్ టీమ్ వికెట్ కీపర్ హ్యారీ నెల్సన్ 170 బంతుల్లో 9ఫోర్లతో (100) సెంచరీ బాదేశాడు. దీంతో.. ఇప్పుడు ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్.. అశ్విన్‌ని ఎదుర్కోవడంపై నెల్సన్‌ను సంప్రదించి సలహాలు తీసుకుంటున్నాడట.

Story first published: Monday, December 3, 2018, 17:23 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X