న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా కోచింగ్ సిబ్బందిలో మరో దిగ్గజం.. ప్రొటీస్ రాత మారేనా!!?

Charl Langeveldt quits as Bangladesh bowling coach, accepts South Africa role

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ సిబ్బందిలో మరో దిగ్గజం చేరనున్నారు. దక్షిణాఫ్రికా మీడియం పేస్ బౌలర్ చార్ల్ లాంగ్‌వెల్డ్‌ జట్టు కోచింగ్ సిబ్బందిలో భాగం కానున్నారు. లాంగ్‌వెల్డ్‌ ఇప్పటికే బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. క్రికెట్ దక్షిణాఫ్రికా నుండి తనకు ఆఫర్ ఉందని వివరిస్తూ బంగ్లా బోర్డుకు ఓ మెయిల్ చేసారు. లాంగ్‌వెల్డ్‌ రాజీనామాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ చైర్మన్ అక్రమ్ ఖాన్ అంగీకరించారు.

<strong>టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. ఒక మార్పుతో భారత్!!</strong>టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. ఒక మార్పుతో భారత్!!

లాంగ్‌వెల్డ్‌ రాజీనామా

లాంగ్‌వెల్డ్‌ రాజీనామా

'దక్షిణాఫ్రికా సీనియర్ జట్టుతో పనిచేయడానికి తనకు ఆఫర్ ఉందని లాంగ్‌వెల్డ్‌ తెలిపారు. తన రాజీనామాను అంగీకరించాల్సిందిగా కోరారు. దీంతో మేము తన రాజీనామాను అంగీకరించాం' అని అక్రమ్ ఖాన్ ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్-2019 తరువాత జూలైలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ వాల్ష్ స్థానంలో లాంగ్‌వెల్డ్‌ను బౌలింగ్ కోచ్‌గా బంగ్లా బోర్డు నియమించింది. అయితే దక్షిణాఫ్రికా బోర్డు నుండి ఆఫర్ రావడంతో సొంత జట్టుకు పనిచేసేందుకు సిద్దమయ్యారు.

దక్షిణాఫ్రికా తరపున 133 వికెట్లు

దక్షిణాఫ్రికా తరపున 133 వికెట్లు

వచ్చే నెలలో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ పర్యటించనుంది. లాంగ్‌వెల్డ్‌ స్థానంలో మరొకరిని తీసుకునేందుకు బంగ్లా బోర్డుకు సరిగ్గా ఒక నెల సమయం ఉంది. ఈ అవకాశం ఎవరికీ వస్తుందో చూడాలి. లాంగ్‌వెల్డ్‌ దక్షిణాఫ్రికా తరపున 6 టెస్ట్, 72 వన్డే, 9 టీ20లు ఆడారు. టెస్టుల్లో 16, వన్డేల్లో 100, టీ20ల్లో17 వికెట్లు తీశారు.

కోచింగ్ బృందంలో భారీ మార్పులు

కోచింగ్ బృందంలో భారీ మార్పులు

ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ కోచింగ్ బృందంలో భారీ మార్పులను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ను దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా నియమించారు. 2023 వరకూ బౌచర్‌ కోచ్‌గా కొనసాగనున్నారు. ఇప్పుడు మరో మార్పు చేయనుంది. మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

డివిలియర్స్‌ రీఎంట్రీ

డివిలియర్స్‌ రీఎంట్రీ

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంధి దశలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి డివిలియర్స్‌, హషీమ్‌ ఆమ్లా, డుమిని, తాహిర్ ఒక్కసారిగా రిటైర్మెంట్‌ తీసుకోవడంతో ఆ జట్టు గాడి తప్పింది. తాజాగా సఫారీ ప్రధాన కోచ్‌గా ఎంపికైన మార్క్‌ బౌచర్‌.. జట్టును చక్కదిద్దే పనిలో పడ్డారు. డివిలియర్స్‌ రీఎంట్రీ కోసం చర్చలను వేగవంతం చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఉంచడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పిన బౌచర్‌.. ఇందులో భాగంగా రిటైర్మెంట్‌ తీసుకున్న ఏబీతో మాట్లాడతానని తెలిపారు.

Story first published: Wednesday, December 18, 2019, 14:41 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X