న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్‌కు ఎదురుదెబ్బ, టోర్నీకి దూరమైన పేసర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు టోర్నీలో ఎదురు దెబ్బ తగిలింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు టోర్నీలో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్‌ బౌలర్‌ వహబ్‌ రియాజ్‌ చీలమండ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

పలు మార్లు స్కానింగ్ తీసిన తర్వాత అతడి గాయం ఇప్పట్లో తగ్గేలా లేకపోవడంతో అతడు టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానంలో మరొకరిని తీసుకునేందుకు అనుమతివ్వాలి పాకిస్థాన్ ఐసీసీ టెక్నికల్ కమిటీకి అభ్యర్థన చేసింది. అయితే దీనికి ఇంకా అనుమతి లభించాల్సి ఉంది.

Champions Trophy: Pakistan's Wahab Riaz ruled out due to injury

టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ టీమిండియాతో ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 124 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో బోలింగ్ చేస్తున్న క్రమంలో వహబ్‌ రియాజ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అనంతరం చీలమండ గాయంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రియాజ్‌ ఘోరంగా విఫలయ్యాడు. 8.4 ఓవర్లలోనే అతను 87 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ వహబ్‌ రియాజ్‌, మహమ్మద్ అమీర్, హసన్ అలీలతో కూడిన పేస్ ఎటాక్‌తో బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది. పాకిస్థాన్‌పై తాజా విజయంతో ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ గెలుపోటముల రికార్డు 12-2గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే పాకిస్థాన్ రెండు సార్లు టీమిండియాను ఓడించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X