న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌తో విభేదాలు ఉన్న మాట నిజమే: చోటు దక్కక పోవడంపై కోహ్లీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు లభించని సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు లభించని సంగతి తెలిసిందే. అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

తుది జట్టులో చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమేనని, కానీ జట్టుకూర్పుని అశ్విన్‌ అర్థం చేసుకోగలడని శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీ మీడియాతో పేర్కొన్నాడు. ప్రధాన బౌలర్‌ను పక్కనబెట్టాల్సి రావడం కష్టమే కదా? అని మీడియా సమావేశంలో విలేకరులు కోహ్లీని ప్రశ్నంచారు.

Champions Trophy: No disagreements with Ashwin over selection matters, says Kohli

అది చాలా సులువు అంటూ కోహ్లీ సమధానమిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 'అశ్విన్‌ టాప్‌ క్లాస్‌ బౌలర్‌. అది అందరికీ తెలిసిన విషయం. అతను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. గత మ్యాచ్‌ సంబంధించిన జట్టుకూర్పును అతను బాగా అర్థం చేసుకున్నాడు. దీనిపై అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

'నువ్వు ఏం చేసినా నేను అండగా ఉంటానని అతను నాతో చెప్పాడు. మా మధ్య ఉన్న అనుబంధం అది' అని కోహ్లీ వెల్లడించాడు. మరోవైపు అశ్విన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే, ఇవి మైదానంలో అనుసరించే వ్యూహాలపైనే కానీ, జట్టు సెలెక‌్షన్‌ విషయంలో కాదని కోహ్లీ అన్నాడు.

'అవును, మా మధ్య బౌలింగ్‌ ప్లాన్స్‌, ఇతరత్రా విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. సొంత ప్లాన్స్‌తో మైదానంలోకి అడుగుపెడతాడు. అందువల్ల ఇలాంటి విభేదాలు వస్తుంటాయి. జట్టు సెలక్షన్ విషయానికి వస్తే అతడు ఓ ప్రొఫెషనల్' అని కోహ్లీ వివరించాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో ధోని స్ధానంలో హార్ధిక్ పాండ్యాని ప్రమోట్ చేయడం ఓ కఠిన నిర్ణయమని కోహ్లీ చెప్పాడు. 'ఇది ఎంతమాత్రం కష్టం కాదు. అయితే పాండ్యాని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు దింపడం బయట నుంచి చూసే వారికి కష్టంగా ఉంటుంది. ఇది వివరించడం కొంచెం కష్టమే' అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X