న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి టెస్టులో కుక్ సెంచరీ: చరిత్రలో నిలిచిపోయే రికార్డు సొంతం

By Nageshwara Rao
India Vs England 5th Test Highlights : Alastair Cook Gets Tweets On His Century
Centuries in debut & farewell Tests: Alastair Cook fifth batsman to achieve rare feat

హైదరాబాద్: ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ ఓపెనర్ అలెస్టర్ కుక్ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 70వ ఓవర్లో తెలుగు తేజం హనుమ విహారి వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న కుక్‌ బౌండరీకి తరలించడంతో కుక్ తన టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీని నమోదు చేశాడు.

<strong>ద్రవిడ్‌కి ఫోన్‌ చేశా, అప్పుడే నాలో కాస్త ఆందోళన తగ్గింది: విహారి</strong>ద్రవిడ్‌కి ఫోన్‌ చేశా, అప్పుడే నాలో కాస్త ఆందోళన తగ్గింది: విహారి

తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతోన్న కుక్ సెంచరీ సాధించడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. కుక్‌ సెంచరీ చేయగానే గ్యాలరీ నుంచి అతని కుటుంబసభ్యులతో పాటు అభిమానుల చప్పట్లతో స్టేడియం హోరెత్తింది. సెంచరీ అనంతరం బ్యాట్‌ను గాల్లోకి లేపి కుక్‌ సంబరాలు చేసుకున్నాడు.

<strong>మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: విహారిని మెచ్చుకుంటూ హర్షా భోగ్లే తెలుగు ట్వీట్</strong>మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: విహారిని మెచ్చుకుంటూ హర్షా భోగ్లే తెలుగు ట్వీట్

1
42378

ఆఖరి టెస్టులో సెంచరీ సాధించిన కుక్

ఇందుకు సంబంధించిన వీడియోని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తన ఆఖరి టెస్టులో సెంచరీ సాధించడంతో కుక్ మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అరంగేట్ర, ఆఖరి టెస్టుల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా కుక్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తన మొదటి, ఆఖరి టెస్టు సెంచరీని కుక్ భారత జట్టుపైనే చేయడం విశేషం.

2006లో నాగ్‌పూర్ వేదికగా

2006లో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అలెస్టర్ కుక్ 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకే జట్టుపై మొదటి, ఆఖరి టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా కాగా, మొత్తంగా మూడో బ్యాట్స్‌మెన్‌గా అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు.

ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే

ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే

అయితే, ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్లు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఈ ఫీట్‌ని అందుకున్నారు. టెస్టుల్లో కుక్‌కి ఇది 33వ సెంచరీ. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. తన ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరిన కుక్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ సాధించాడు.

పూర్తి ఆధిపత్యం దిశగా ఇంగ్లాండ్

పూర్తి ఆధిపత్యం దిశగా ఇంగ్లాండ్

114/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను మన బౌలర్లు వీలైనంత త్వరగా ఆలౌట్‌ చేద్దామనుకుంటే వారు మాత్రం క్రీజులో పాతుకుపోయి స్కోరు బోర్డుని పరుగెత్తిస్తున్నారు. జోరూట్-కుక్ జోడీ క్రీజులో పాతుకుపోయింది.

లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 243/2

బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. ఈ జోడీని విడతీసేందుకు కోహ్లీ తన బౌలర్లను తెగ మారుస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 74 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుక్‌ (103), రూట్‌ (92) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 283 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, September 10, 2018, 18:01 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X