న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగు సిక్సులు: ఘోర అవమానంపై పెదవి విప్పిన స్టోక్స్

2016లో భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 పైనల్స్‌లో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ ఏడాది తర్వాత ఆ బాధపై స్పందించాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: 2016లో భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 పైనల్స్‌లో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ ఏడాది తర్వాత ఆ బాధపై స్పందించాడు. ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ ఓ ఇంగ్లీషు ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చాడు. అందులో మైదానంలోనే కన్నీరు పెట్టుకున్న ఘటనపై పెదవి విప్పాడు.

80 పరుగుల తర్వాత విధ్వంసమే: కోహ్లీ, స్మిత్‌పై బెన్ స్టోక్స్80 పరుగుల తర్వాత విధ్వంసమే: కోహ్లీ, స్మిత్‌పై బెన్ స్టోక్స్

'వరుసగా నాలుగు సిక్సర్లు సమర్పించుకున్న తొలి వ్యక్తిని నేను కాదు. అలానే చివరి బౌలర్‌ని కూడా కాదు. వరల్డ్ కప్ తర్వాత మళ్లీ బ్రాత్‌వైట్‌ని నేను కలిశాను. కానీ మా మధ్య ఈ విషయం అసలు చర్చకు రాలేదు. మేము ఇద్దరం ఈ అంశాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లిపోతున్నాం. కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో చివరి ఓవర్ గురించే ఎక్కువ చర్చ జరుపుతున్నారు. ఆరోజు నేను ఫెయిల్ అయినంత మాత్రానా.. రేపు కూడా విఫలమవుతానా?' అని బెన్‌స్టోక్స్ ప్రశ్నించాడు.

Carlos Brathwaite 4 sixes off 4 Balls in last over of Ben Stokes in ICC T20 world cup 2016

వెస్టిండిస్‌తో జరిగిన పైనల్స్‌లో స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో వెస్టిండిస్ క్రికెటర్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ తమవైపు ఉందనుకున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. అయితే చివరి ఓవర్‌లో అనూహ్యంగా బ్రాత్‌వైట్ విజృంభణతో వరల్డ్ కప్ చేజారడంతో బెన్‌స్టోక్స్ మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు.

ఈ సంఘటన అప్పట్లో మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులందరినీ కలచివేసింది. అయితే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బెన్ స్టోక్స్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫ్రాంఛైజీ ఏకంగా రూ. 14.5 కోట్లకు బెన్‌స్టోక్స్‌ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

తద్వారా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ బెన్‌స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వచ్చాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ పదో సీజన్ ఆరంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X