న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suresh Raina రీఎంట్రీ ఇవ్వనున్నాడా..? బీసీసీఐ ఏమంటోంది..?

Can Suresh Raina Return To UAE? What BCCI Official Says CSK Vice Captian Departure from IPL 2020

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే అతని నిష్క్రమణ తీవ్ర దుమారాన్ని రేపింది. ముఖ్యంగా సీఎస్కేను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. టీమ్‌మెనేజ్‌మెంట్‌తో విభేదాలు.. హోటల్ గది వ్యవహారం అంటూ అనేక పుకార్లకు కారణమైంది. చివరకు ఆ జట్టు ఓనర్ ఎన్ శ్రీనివాసన్ కూడా వార్తల్లో నిలిచేలా చేసింది.

మళ్లీ చూడొచ్చు..

మళ్లీ చూడొచ్చు..

అయితే ఈ అసత్య ప్రచారాలకు తెరదించుతూ వ్యక్తిగత కారణాలతోనే లీగ్ నుంచి తప్పుకున్నానని రైనా స్పష్టం చేశాడు. తన మేనత్త కుటుంబంపై దుండగులు జరిపిన దాడిపై కూడా స్పందించాడు. ఓవైపు బంధువులు దారుణ హత్యకు గురవడం.. మరోవైపు కుటుంబం కన్నా ఏది ఎక్కువకాదనే ఆలోచనతోనే భారత్‌కు వచ్చానన్నాడు. ఐపీఎల్‌ను వీడినా ప్రాక్టీస్ చేస్తున్నానని, మళ్లీ తనను చూసే అవకాశం కూడా ఉందన్నాడు.

‘క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్ చేస్తున్నా. చెప్పలేం నన్ను మళ్లీ మీరు సీఎస్కే క్యాంప్‌లో చూడవచ్చు'అని తెలిపాడు. ఇక రైనా రీఎంట్రీపై ఆ జట్టు ఓనర్ ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. అది తన చేతిలో లేదని, ధోనీ, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుందన్నారు.

రైనా రీఎంట్రీ ఖాయం..

రైనా రీఎంట్రీ ఖాయం..

ఇక రైనా రీఎంట్రీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైనా పునరాగమనం ఖచ్చితంగా ఉంటుందని, కాకపోతే కరోనా నిబంధనల కారణంగా ప్రారంభమ్యాచ్‌లకు దూరమవుతాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌‌ఇన్‌ఫోతో అన్నాడు. ‘ఐపీఎల్‌లో సురేశ్ రైనా ఆడుతాడనే అనుకుంటున్నా. క్వారంటైన్ నిబంధనల కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ సురేశ్ రైనా రీ ఎంట్రీ మాత్రం పక్కా ఉంటుందనేది నా అంచనా. అందుకే రైనా స్థానంలో సీఎస్కే ఎవరినీ తీసుకోకపోయినా నాకు అశ్చర్చమనిపించలేదు.'అని దీప్ దాస్ గుప్తా పేర్కొన్నారు.

అలా అయితే రైనాను అనుమతించం..

అలా అయితే రైనాను అనుమతించం..

ఇక రైనా రీఎంట్రీకి మార్గం సుగుమం అయితే మాత్రం.. అతను యూఏఈ చేరుకున్నా తర్వాత 6 రోజుల క్వారంటైన్‌ పాటించాలి. మూడు సార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటీవ్ రావాలి. అప్పుడే బయో సెక్యూర్ బబుల్‌లోకి అనుమతిస్తారు. అదే విధంగా తన నిష్క్రమణకు సరైనా కారణాన్ని చెప్పి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రైనా నిష్క్రమణకు వ్యక్తిగత కారణమా? లేక మానసిక సమస్యా? అనే విషయాన్ని బేరిజు వేసుకోవాల్సి ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. ‘ధోనీతో విభేధాలైతే అది సీఎస్కే అంతర్గత వ్యవహారం. కుటుంబ సమస్యలైతే అది రైనా వ్యక్తిగత సమస్య. డిప్రెషన్ కారణమైతే అది రైనా మానసిక సమస్య. అదే అయితే మేం అతన్ని అనుమతించం. జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని సదరు అధికారి ప్రశ్నించారు.

మూడులో ధోనీ ఆడాలి..

మూడులో ధోనీ ఆడాలి..

తన గైర్హాజరీ కారణంలో మూడో స్థానంలో ధోనీని ఆడించాలని రైనా అభిప్రాయపడ్డాడు. 'టీమిండియాకు ఆడే సమయంలో నెం.3లో ఆడిన అనుభవం చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి ఉంది. 2005 ఏప్రిల్ నెలలో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో సునామి సృష్టించాడు. పాకిస్థాన్‌పై మూడో స్థానంలో ఆడి 148 పరుగులు చేసిన ఆ వన్డేని అంత సులువుగా ఎలా మర్చిపోగలం. జట్టులో నెం.3 బ్యాటింగ్ స్థానం చాలా కీలకం. ఆ స్థానానికి అనుభం ఉన్న ధోనీ అయితే న్యాయం చేయగలడు' అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.

Story first published: Sunday, September 6, 2020, 15:10 [IST]
Other articles published on Sep 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X