న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ కోసం నిద్ర, తిండి రెండూ పక్కన పెట్టేశా'

Can sacrifice sleep to watch MS Dhonis innings, says wicket-keeper batsman Mohammad Shahzad

హైదరాబాద్: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు బెంగళూరు వేదికగా సర్వం సిద్ధమైంది. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు.. తొలిసారి ఈ ఫార్మాట్‌లో గెలిచి శుభారంభాన్ని ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టుపై అంచనాలు రెట్టింపవగా.. ఇరు జట్ల క్రికెటర్లు కవ్వింపు మాటలతో రెచ్చిపోతున్నారు. కానీ.. అఫ్గానిస్థాన్‌ వికెట్ కీపర్ మొహమ్మద్ షెహజాద్ మాత్రం భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.

ధోనీ కోసం..ఇష్టమైన వీటిని కాసేపు పక్కన:

ధోనీ కోసం..ఇష్టమైన వీటిని కాసేపు పక్కన:

భారీకాయంతో ఉన్నా.. ధోనీ తరహా హెలికాప్టర్‌ సిక్సర్లు కొడుతూ షెహజాద్ వెలుగులోకి వచ్చాడు. ‘జీవితంలో రెండింటిని అస్సలు విస్మరించలేను. మొదటిది నిద్ర, రెండోది భోజనం. కానీ.. మహేంద్రసింగ్ ధోనీ కోసం ఓ సారి నాకు ఇష్టమైన వీటిని కాసేపు పక్కన పెట్టాల్సి వచ్చింది. భారత జట్టు వెస్టిండీస్‌లో మ్యాచ్ ఆడుతోంది. అది ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 15 పరుగులు అవసరం అయ్యాయి. ధోనీ క్రీజులో ఉన్నాడు.'

అప్పుడు రంజాన్ ఉపవాస దీక్షలో :

అప్పుడు రంజాన్ ఉపవాస దీక్షలో :

'అప్పటి వరకు ఎప్పుడైనా కాసేపు నిద్ర మేలుకోవాల్సి వస్తే.. నీళ్లు తాగేవాడ్ని. కానీ, ఆ సమయంలో రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాను. ఇఫ్తార్‌‌కి మరో 3 - 4 నిమిషాల సమయమే ఉంది.. నా ముందే భోజనం కూడా సిద్ధంగా ఉంది. ఆ క్షణంలో భారత్ జట్టు గెలవాలని కోరుకున్నా.. ధోనీ రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ని ముగించేశాడు. ఆ రోజు ఆనందానికి భోజనంతో పాటు నిద్ర కూడా ఆలస్యమైంది' అని మొహమ్మద్ షెహజాద్ వెల్లడించాడు.

ధోనీ.. 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో.. :

ధోనీ.. 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో.. :

2013లో వెస్టిండీస్‌ వేదికగా భారత్, శ్రీలంక, వెస్టిండీస్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరిగింది. ఫైనల్లో భారత్‌తో తలపడిన శ్రీలంక 48.5 ఓవర్లలో 201 పరుగులకి ఆలౌటవగా.. ధోనీ నాటౌట్‌గా నిలిచి 52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో.. (45) పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 49.4 ఓవర్లలో 203/9తో భారత్ గెలుపొందింది.

ఎరంగ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 :

ఎరంగ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 :

ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 15 పరుగులు అవసరమవగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉండటంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. కానీ.. భువనేశ్వర్‌ని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోనే ఉంచిన ధోనీ.. చివరి ఓవర్ వేసిన ఎరంగ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాది జట్టుని గెలిపించాడు.

Story first published: Thursday, June 14, 2018, 9:49 [IST]
Other articles published on Jun 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X