న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ చేతిలో ఓడితే కష్టమే!: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మళ్లీ నిరూపించుకుంటాడా?

Asia Cup 2018: 'Always exciting to play against Pakistan' says Rohit Sharma
Can Rohit Sharmas unique streak help India win Asia Cup 2018?

హైదరాబాద్: రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరు... ధోని ఫామ్ లేమి... నిలకడలేని బ్యాట్స్‌మెన్‌.. అనుభవం లేని యువ ఆటగాళ్లు.. ఇన్ని ప్రతికూల సవాళ్ల మధ్య ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెడుతూ కెప్టెన్‌గా తనకు తాను నిరూపించుకున్నాడు.

<strong>ఆసియా కప్‌‌లో కొత్త జెర్సీల్లో మెరవనున్న పాక్, బంగ్లా ఆటగాళ్లు</strong>ఆసియా కప్‌‌లో కొత్త జెర్సీల్లో మెరవనున్న పాక్, బంగ్లా ఆటగాళ్లు

అయితే, ఆసియా కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్ రూపంలో రోహిత్ శర్మ అసలు సిసలైన సవాల్ ఎదురుకానుంది. ఇంగ్లీషు గడ్డపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 1-4తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకోవడంతో ఇప్పుడు అభిమానులంతా రోహిత్ శర్మ కెప్టెన్సీపై అంచనాలు పెట్టుకున్నారు.

 తొలిసారి శ్రీలంక పర్యటన

తొలిసారి శ్రీలంక పర్యటన

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పెళ్లి కోసం విరాట్ కోహ్లీ జట్టుకు దూరం కావడంతో తొలిసారి శ్రీలంక పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్ సేన వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ కూడా కైవసం చేసుకుది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌ శర్మకి దక్కాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది.

కొలంబో వేదికగా జరిగిన

కొలంబో వేదికగా జరిగిన

కొలంబో వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీలో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో టీమిండియాకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. రోహిత్‌ కెప్టెన్సీ సత్తా గురించి ఐపీఎల్‌లోనే అందరికీ అర్థమైంది. ఐపీఎల్‌లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు ట్రోపీని ముద్దాడింది.

అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించింది కెప్టెన్‌గా

అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించింది కెప్టెన్‌గా

రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా మూడు వన్లేల్లో రెండు, తొమ్మిది టీ20ల్లో ఎనిమిది మ్యాచ్‌లు గెలుపొందింది. వన్డేల్లో మరోసారి డబుల్‌ సెంచరీ, టీ20లో టీమిండియా తరుపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించింది కెప్టెన్‌గా ఉన్నప్పుడే. దీంతో రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ నెగ్గుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 2019 ప్రపంచకప్‌ దృష్ట్యా సెలక్టర్లు ఆటగాళ్లను ఈ టోర్నీలో పరీక్షించనున్నారు.

కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మకు బాధ్యతలు

కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మకు బాధ్యతలు

కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో మిడిలార్డర్ బలాన్ని అంచనావేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే సామర్థ్యంపై ఒక అంచనాకు రానుంది. ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌లు ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. సీనియర్‌ ఆటగాడు మాజీ కెప్టెన్‌ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ ఈ టోర్నీ ద్వారా స్పష్టమవుతుంది.

పాకిస్థాన్‌తో అమీతుమీ

పాకిస్థాన్‌తో అమీతుమీ

కొత్త లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ టీమిండియాకు అదనపు బలమవుతాడా అనేది కూడా ఈ టోర్నీలో తేలనుంది. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 18న హాంకాంగ్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాతి రోజు (19న) పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. దీంతో రోహిత్ శర్మ క్రికెట్ అభిమానుల కోరికను ఏ మేరకు తీరుస్తాడో చూడాలి.

Story first published: Saturday, September 15, 2018, 12:52 [IST]
Other articles published on Sep 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X