న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

47 ఏళ్ల తర్వాత: 1971 టెస్టు సిరిస్‌ని స్పిన్నర్లు పునరావృతం చేస్తారా?

By Nageshwara Rao
Can India repeat history in England after 47 years with new-age spin trio?

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం అజిత్ వాడేకర్ సారథ్యంలోని టీమిండియా సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టు సిరిస్‌ను సాధించింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా విజయం సాధించడంలో అప్పటి స్పిన్నర్లు చంద్రశేఖర్‌, వెంకటరాఘవన్‌, బిషన్‌సింగ్‌ బేడీ కీలకపాత్ర పోషించారు.

పేసర్లకు అనుకూలంగా ఉండే ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత స్పిన్నర్లు చెలరేగడంతో టెస్టు సిరిస్ భారత్ కైవసం అయింది. 1971లో ఇంగ్లాండ్ పర్యటనలో చంద్రశేఖర్‌(13), వెంకటరాఘవన్‌(13), బిషన్‌సింగ్‌ బేడీ(11) ముగ్గురూ కలిపి మొత్తం 37 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి ఆరంభమయ్యే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ముగ్గురు స్పిన్నర్లను జట్టులో చేర్చింది.

ముగ్గురు స్పిన్నర్లను చేర్చిన సెలక్టర్లు

ముగ్గురు స్పిన్నర్లను చేర్చిన సెలక్టర్లు

అప్పటిలాగే ఇప్పటి జట్టులో ముగ్గురు స్పిన్నర్లను చేర్చడం వెనుక టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాత్మంకగా వ్యవహారిస్తోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లాండ్‌లో వేసవి ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. దీంతో అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని అంతా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ జట్టు ప్రకటించిన టెస్టు జట్టులో లెగ్ స్పిన్నర్ రషీద్‌ అలీకి చోటు కల్పించింది. మొదటి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు.

2014 పర్యటనలో రెండు టెస్టులాడి మూడు వికెట్లు

2014 పర్యటనలో రెండు టెస్టులాడి మూడు వికెట్లు

ఈ ముగ్గురిలో అశ్విన్‌ సీనియర్‌. 2014 పర్యటనలో రెండు టెస్టులాడి మూడు వికెట్లు తీశాడు. ఇక, జడేజా ఇక్కడ నాలుగు టెస్టులాడి తొమ్మిది వికెట్లు తీశాడు. అశ్విన్‌తో పోలిస్తే జడేజా కాస్త వేగవంతమైన పేస్‌తో బంతులు విసిరి ఫలితం రాబట్టాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతి స్పిన్ కాదు కాబట్టి, వేగంతో కూడిన బంతులు విసిరితే బ్యాట్స్‌మెన్‌ వెంటనే వాటిని అర్థం చేసుకోలేరు. ఇంగ్లాండ్ పిచ్‌లపై లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు రాణించే అవకాశం ఉంది. ఇటీవలే ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో 23 ఏళ్ల కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.

పరిమిత ఓవర్ల సిరిస్‌లో కుల్దీప్ మెరుగైన ప్రదర్శన

పరిమిత ఓవర్ల సిరిస్‌లో కుల్దీప్ మెరుగైన ప్రదర్శన

వన్డే, టీ20 సిరిస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతడికి మొదటి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. ఇప్పటికే ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను కుల్దీప్ ముప్పుతిప్పులు పెట్టిన సంగతి తెలిసిందే. పలువురు ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు సైతం టెస్టులకు కుల్దీప్ సిద్ధంగా ఉన్నాడని, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అతడు మ్యాజిక్ చేస్తాడని మద్దతు కూడా పలికారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ కూడా కుల్దీప్ విషయంలో సానుకూలంగా ఉండటం అతడికి కలిసొచ్చే అంశం.

ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలం

ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలం

ఇంగ్లాండ్ పర్యటనలో భారత స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ 1971లో అప్పటి స్పిన్నర్లు చేసిన మ్యాజిక్‌ను పునరావృతం చేసి సిరిస్ అందిస్తారా? లేక ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ వలలో చిక్కుకుంటారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటం సంతోషించాల్సిన విషయం.

Story first published: Wednesday, July 25, 2018, 15:29 [IST]
Other articles published on Jul 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X