న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్‌ప్రైజ్ ఇచ్చిన బోర్డు: మూడేళ్ల తర్వాత జట్టులో చోటు

By Nageshwara Rao
Cameron White gets a shock recall to Australia’s one-day squad

హైదరాబాద్: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు కామెరూన్ వైట్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో ఆదివారం నుంచి ఆరంభమయ్యే ఐదు వన్డేల సిరిస్‌లో కామెరూన్‌కు చోటు కల్పిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు సిద్ధం కావాలని కామెరూన్‌కు సెలక్టర్లు కబురు పంపారు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన క్రిస్‌ లిన్‌ స్థానంలో 34 ఏళ్ల కామెరాన్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. 2015, జనవరి 23న చివరిసారిగా ఆస్ట్రేలియా తరుపున వన్డే మ్యాచ్ ఆడాడు.

సుదీర్ఘ విరామం తరువాత తాజాగా చోటు దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా తరుపున కామెరాన్‌ ఇప్పటివరకు 88 వన్డే మ్యాచ్‌లాడాడు. అయితే ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లీగ్‌లో కామెరూన్ అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడికి అవకాశం కల్పించామని క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్‌ ట్రావెర్‌ హాన్స్‌ తెలిపారు.

గత కొంతకాలంగా దేశవాళీ లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేయడమే అతని ఎంపికకు ప్రధాన కారణమని తెలిపాడు. ముఖ్యంగా బిగ్‌బాష్‌ లీగ్ ‌(బీబీఎల్‌)లో అత్యధిక స్కోర్లను సాధించిన ఆటగాళ్లలో కామెరాన్‌ ఒకడిగా నిలిచాడు. కామెరూన్ మంచి ఫీల్డర్ కూడా కావడంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కలిసొస్తుందని చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 18:16 [IST]
Other articles published on Jan 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X