న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం: దక్షిణాఫ్రికాతో జింబాబ్వే 4రోజుల టెస్ట్

By Nageshwara Rao
 Boxing Day Test: South Africa's Du Plessis to miss historic 4-day pink-ball Test against Zimbabwe

హైదరాబాద్: టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయమ మొదలు కానుంది. ప్రయోగాత్మకంగా పరిశీలించనున్న నాలుగురోజుల టెస్టుకు అంతా రంగం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే పోటీపడుతున్న ఈ డే/నైట్‌ టెస్టు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ టెస్టు కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా జట్టుకు డుప్లెసిస్, జింబాబ్వే జట్టుకు క్రీమర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అయితే జ్వరంతో బాధపడుతున్న డుప్లెసిస్‌ ఆడేది అనుమానంగా ఉంది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌కు కొన్ని నిబంధనల్లో మార్పులు చేశారు.

నాలుగు రోజుల టెస్టులో చేసిన మార్పులు:
* ఐదు రోజుల ఆటలో రోజుకు ఆరు గంటలు ఆడనుండగా.. ఈ టెస్టు అరగంట సేపు ఎక్కువగా అంటే ఆరున్నర గంటలపాటు సాగనుంది.
* ఇక ఓవర్ల విషయానికి వస్తే రోజుకు 98 ఓవర్లు వేయనున్నారు.
* ఫాలో ఆన్‌ ఇవ్వడానికి 150 పరుగుల ఆధిక్యం సరిపోతుంది. ఐదు రోజుల మ్యాచ్‌లో ఈ పరుగుల సంఖ్య 200గా ఉంది.
* మొదటి రెండు సెషన్లు రెండు గంటలకు బదులుగా.. 2 గంటల 15 నిమిషాలకు పెంచారు.
* తొలిసెషన్‌ తర్వాత లంచ్‌కు బదులు 20 నిమిషాల టీ బ్రేక్‌ ఇవ్వనున్నారు. రెండో సెషన్‌ తర్వాత 40 నిమిషాల డిన్నర్‌ బ్రేక్‌ ఇస్తారు.
* 1972/73 తర్వాత నాలుగు రోజుల పాటు జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

దక్షిణాఫ్రికా Vs జింబాబ్వే (ఏకైక టెస్టు)
వేదిక: పోర్ట్ ఎలిజిబెత్‌లోని సెయింట్ జార్జి పార్క్
మ్యాచ్ సమయం: సాయంత్రం 5 గంటలకు - సోనీ నెట్ వర్క్‌లో

Story first published: Tuesday, December 26, 2017, 12:07 [IST]
Other articles published on Dec 26, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X