న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూల్స్ బ్రేక్ చేసి అడ్డంగా బుక్ అయిన నలుగురు భారత క్రికెటర్లు.. చర్యలు తప్పవా?

Bio-bubble breach by Indian players ahead of Sydney Test, Rishab Pant was hugged by a Indian fan

సిడ్నీ: టెస్ట్ సిరీస్‌ ఆడుతున్న భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు కఠోర సాధన చేస్తూనే.. మరోవైపు కాస్త సమయం దొరికినప్పుడు కంగారూల గడ్డను అలా చుట్టేస్తున్నారు. రెండో టెస్ట్ విజయానంతరం భారత జట్టు రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేశారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కరోనా రూల్స్ బ్రేక్ చేయడంతో వారిపై చర్యలు తప్పేలా లేవు!!. విషయంలోకి వెళితే

రెస్టారెంట్‌కు వెళ్లిన నలుగురు క్రికెటర్లు:

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ని బయో-సెక్యూర్ బబుల్ వాతావరణంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు టీమ్ స్టాఫ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బబుల్‌ని దాటి వెలుపలికి వెళ్లకూడదు. ఒకవేళ వెళితే.. మళ్లీ క్వారంటైన్, కరోనా వైరస్ పరీక్షల అనంతరమే బబుల్‌లోకి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు ముంగిట బయో బబుల్‌ని దాటి టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభమన్ గిల్, నవదీప్ సైనీ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తిన్నారు. దీంతో ఈ నలుగురూ బబుల్‌ రూల్స్ బ్రేక్ చేశారు.

అభిమానికి హాగ్ :

అభిమానికి హాగ్ :

సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే రెండు జట్లూ బస చేస్తున్నాయి. సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో మ్యాచ్‌కి మూడు రోజులు ముందు మాత్రమే రెండు జట్లు అక్కడికి వెళ్లనున్నాయి. అంటే.. 4వ తేదీన ఇరు జట్లు సిడ్నీ చేరుకుంటాయి. ఈలోపే భారత ఆటగాళ్లు నలుగురు బయో-సెక్యూర్ బబుల్ రూల్స్ బ్రేక్ చేశారు. రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తినడమే కాకుండా.. అక్కడ ఓ అభిమానికి హాగ్ కూడా ఇచ్చారు. ఇది బబుల్ నియమాలకు విరుద్ధం. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. వారిపై సీఏ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

తాజాగా జట్టుతో కలిసిన రోహిత్:

తాజాగా జట్టుతో కలిసిన రోహిత్:

గాయం కార‌ణంగా వ‌న్డేలు, టీ20ల‌తో పాటు తొలి రెండు టెస్ట్‌లకు దూర‌మైన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ‌.. సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని బుధవారం సాయంత్రం టీమ్‌తో క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇక ఆలస్యం చేయకుండా గురువారం అత‌డు మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ కూడా చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో అద్భుత విజ‌యం సాధించిన భారత ఆటగాళ్లు అందరూ రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ మాత్రం నెట్స్‌లో చెమటోడ్చాడు. సిడ్నీ టెస్టుకి రోహిత్ శర్మని వైస్ కెప్టెన్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ నియమించిన విషయం తెలిసిందే.

బుమ్రాకి పాకిస్థాన్ కళ అబ్బింది.. అతడిని ఎదుర్కొనేందుకు టాప్ బ్యాట్స్‌మెన్‌ సైతం జంకుతున్నారు: అక్తర్

Story first published: Saturday, January 2, 2021, 12:03 [IST]
Other articles published on Jan 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X