న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా మాటకొస్తే భువనేశ్వర్ కుమార్‌కు ఓ రేంజులో గౌరవం దక్కాల్సింది కానీ.. : హార్దిక్ పాండ్యా

Bhuvneshwar Kumar Should Deserves A Lot Of Respect with His Heroics in T20Is says Hardik

భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. భువీ గురించి పెద్దగా బయట ఎవరూ మాట్లాడనప్పటికీ.. అతను టీ20 క్రికెట్‌లో రాణిస్తున్న విధానానికి తప్పకుండా మరింత గౌరవం, ప్రశంసలు పొందడానికి అర్హుడు అని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ పేసర్ అయిన భువీ తనను తాను ఒక మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు అని హార్దిక్ పేర్కొన్నాడు.

 ఇన్ స్వింగ్‌తో కట్టడిగా భువీ బౌలింగ్

ఇన్ స్వింగ్‌తో కట్టడిగా భువీ బౌలింగ్

నిన్నటి మ్యాచ్‌లో భువనేశ్వర్ తన మూడు ఓవర్లలో కేవలం 16పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. వర్షం కారణంగా.. మ్యాచ్ ఆలస్యం కావడంతో 12ఓవర్లకు మ్యాచ్ కుదించాల్సి వచ్చింది. ఇక తన తొలి ఓవర్లోనే భువీ అద్భుతమైన ఇన్‌స్వింగ్ డెలివరీతో ఐర్లాండ్ కెప్టెన్ ఆండీ బల్బిర్నేను బౌల్డ్ చేసి ఐర్లాండ్‌ను గట్టి దెబ్బ తీశాడు. ఇక ఐర్లాండ్ బ్యాటర్లు 12ఓవర్లలో 108పరుగులు చేసినప్పటికీ.. భువనేశ్వర్ వేసిన 3ఓవర్లలో పెద్దగా హిట్టింగ్ చేయలేకపోయారు.

దక్కాల్సినన్ని ప్రశంసలు దక్కలేదు

దక్కాల్సినన్ని ప్రశంసలు దక్కలేదు

ఇక ఈ మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. 'సహజంగా బౌలర్‌గా భువీ ఎలాంటి క్యాలిబర్ కలిగిన ప్లేయరో మనందరికీ తెలుసు. మ్యాచ్‌ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శనను అతను పదే పదే ప్రదర్శించగలడు. అతని గురించి ప్రముఖులు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి అతనికి రావాల్సినంత ప్రశంసలు రావట్లేదు. మీరు గతంలోకి వెళ్లి చూస్తే.. అతని బౌలింగ్ ప్రదర్శనలు, అతని స్థిరత్వం బట్టి అతను చాలా గౌరవాన్ని అందుకోవాల్సిన వాడు. అతను అందుకు అర్హుడు కూడా' అని హార్దిక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 మునుపటి ఫామ్ అందుకున్న భువీ

మునుపటి ఫామ్ అందుకున్న భువీ

గతేడాది ఐపీఎల్లో.. టీ0 ప్రపంచకప్‌ టైంలో భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌ లేమీతో సతమతమయ్యాడు. అలాగే గాయాల పాలయ్యాడు. ఇక అతన్ని టీ20 ప్రపంచ కప్‌ జట్టు నుండి తొలగించబడటానికి ముందు కేవలం 2మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన భువీ.. మళ్లీ తన మునుపటి ఫామ్ అందుకున్నట్లు కన్పిస్తుంది. బంతిని స్వింగ్ చేయడంలోనూ, పవర్‌ప్లేలో ప్రభావవంతంగా బౌలింగ్ చేయడంలో అతను తన గత దూకుడును అందుకున్నాడు. భువనేశ్వర్ గత 10టీ20ల్లో 6.64ఎకానమీ రేటుతో 12వికెట్లు తీశాడు.

దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్‌లను కూడా మెచ్చుకున్న హార్దిక్

దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్‌లను కూడా మెచ్చుకున్న హార్దిక్

ఇక నిన్నటి మ్యాచ్‌లో 3ఓవర్లలో 1వికెట్ తీసి కేవలం 11పరుగులు మాత్రమే ఇచ్చిన యుజ్వేంద్ర చాహల్‌ను సైతం హార్దిక్ ప్రశంసించాడు. 'భువీ, మరియు యుజీ నా మట్టుకు టాప్ క్లాస్ ప్లేయర్లు. వాళ్లు మ్యాచ్ విన్నర్లు. మనం వాళ్లకు బంతిని అందిస్తే చాలు. మీరెది అనుకుంటారో అలా వాళ్లు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్‌ను గెలిపించగలరు.' అని హార్దిక్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ మోకాలి గాయంతో ఓపెనర్‌గా బరిలోకి దిగకపోవడంతో.. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా 4వ వికెట్‌కు 64పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ లక్ష్యాన్ని కేవలం 9.2ఓవర్లలోనే ఛేదించింది. దీపక్ హుడా గురించి హార్దిక్ మాట్లాడుతూ.. 'చివరి నిమిషంలో నువ్వే ఓపెనింగ్ చేయబోతున్నావని చెప్పినప్పుడు దీపక్ హుడా జంకకుండా.. వెళ్లి ఓపెనింగ్ చేశాడు. అలాగే గేమ్ ముగించేదాకా క్రీజులో నిలబడ్డాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది' అని తెలిపాడు.

Story first published: Monday, June 27, 2022, 16:24 [IST]
Other articles published on Jun 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X