న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ కొత్త ప్లాన్.. 14రోజులు తర్వాతే భార్యలతో..!!

BCCI may allow WAGs to be with cricketers on overseas tours

హైదరాబాద్: టెస్టు సిరీస్ జరుగుతుండగా.. విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు వారి భార్యలకు దూరంగా ఉండాలని బీసీసీఐ పెట్టిన ఆంక్షను సడలించింది. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త పాలసీని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అమలులోకి తేనుంది. ఇకపై పర్యటనల్లో భార్యలు, గర్ల్‌ ఫ్రెండ్స్‌ క్రికెటర్లతో 14 రోజులు ఉండేందుకు అనుమతించనుంది. అయితే పర్యటన మొదలయ్యాక రెండు వారాల తర్వాతే ఆటగాళ్లకు ఈ వెసులుబాటు లభిస్తుంది.

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌‌లో కనీసం మూడు మ్యాచ్‌ల వరకూ భార్యలకు దూరంగా ఉండాలని బీసీసీఐ ఇటీవల సూచించింది. భారత క్రికెటర్లు ఏ దేశ పర్యటనకు వెళ్లినా వారి భార్యలు, ప్రియురాళ్లతో అక్కడ వాలిపోవడం సర్వసాధారణం. దానిలో భాగంగా మ్యాచ్‌లకు మధ్య వచ్చే విరామాల్లో చెట్టా పట్టాలేసుకుని విహరిస్తుంటారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విరాట్‌ కోహ్లి , శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, రోహిత్‌ శర్మ సహా మరికొంత మంది క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములతో సరదాగా గడిపారు. అయితే గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాల నేపథ్యంలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాల నేపథ్యంలో బోర్డు ఆ సూచన చేసింది. ఏదేని టోర్నీ, సిరీ్‌సల్లో భారత్‌ విఫలమైన తరుణంలో క్రికెటర్ల భార్యలపై విమర్శలు వస్తుండడంతో బీసీసీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇలా బీసీసీఐ తాజా పాలసీని అమలులోకి తీసుకు రానున్నట్లు ముంబై మిర్రర్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

Story first published: Monday, July 30, 2018, 15:38 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X