న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇది నిబంధనలు ఉల్లంఘించడమే'

BCCI likely to haul up Murali Vijay, Karun Nair for breach of central contract

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు తమను జట్టు నుంచి తప్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే క్రికెటర్లు. ఇలా సెలక్టర్లపై విమర్శలు చేస్తోన్న మురళీ విజయ్‌, కరుణ్‌ నాయర్‌లపై బీసీసీఐ చర్యలు తీసుకునేందుకు ఆస్కారమున్నట్లు సమాచారం. బోర్డుతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు ఏదైనా సిరీస్‌ ముగిసిన నెల రోజుల వరకు బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు. మీడియాతో మాట్లాడకూడదు.

ఇదే విషయంపై బీసీసీఐ ఆగ్రహంతో

ఇదే విషయంపై బీసీసీఐ ఆగ్రహంతో

కానీ, తమను జట్టు నుంచి తప్పించడంపై సెలక్టర్లు సమాచారం ఇవ్వలేదంటూ విజయ్‌, కరుణ్‌ వేర్వేరుగా విమర్శలు చేశారు. దీనిపై బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ‘సెలక్షన్‌ విధానంపై మాట్లాడటం సరి కాదు. ఇది కాంట్రాక్టు ఉల్లంఘనే. ఈ నెల 11న హైదరాబాద్‌లో పాలకుల కమిటీ సమావేశం ఉంది. అందులో ఈ విషయమై చర్చిస్తాం' అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

చెప్పాల్సింది చెప్పారు..నేనేమీ:

చెప్పాల్సింది చెప్పారు..నేనేమీ:

వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు ముందు కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఓ అంశంపై ఓ వ్యక్తి ఇప్పటికే మాట్లాడిన తర్వాత దానిని మళ్లీ ఇక్కడ అడగొద్దు. 'సెలక్టర్లు ఇప్పటికే దీనిపై చెప్పాల్సింది చెప్పారు. నేనేమీ మాట్లాడను. సెలక్టర్లు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. బయటి వాళ్లు ఏమంటున్నారనే దానితో సంబంధం లేకుండా ఎవరి పని వాళ్లు చేస్తున్నారు' అని కోహ్లి చెప్పాడు.

 జట్టు నుంచి తప్పించడంపై వివరణ లేదు

జట్టు నుంచి తప్పించడంపై వివరణ లేదు

వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ నుంచి మురళీ విజయ్‌ను సెలక్టర్లు తప్పించారు. ఈ సందర్భంగా మురళీ విజయ్ మాట్లాడుతూ "మూడో టెస్టు నుంచి నన్ను తప్పించే సమయంలో చీఫ్ సెలక్టరే కాదు.. ఎవరూ నాతో కనీసం మాటమాత్రమైనా చెప్పలేదు. అప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా ఆ సిరీస్‌లో వేటు పడటంపై నాకు సరైన వివరణ రాలేదు" అని అన్నాడు.

బ్యాట్‌తోనే సమాధానం చెబుతా

బ్యాట్‌తోనే సమాధానం చెబుతా

జట్టుకు దూరమవడం అనేది సహజంగా ఎవరికైనా బాధ కల్గిస్తుంది, దీన్ని అధిగమించడం కష్టం కావచ్చు. నన్ను తప్పియడానికి తీసుకున్న నిర్ణయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రతి ఒక్కరూ పాలుపంచుకున్నారు. ఓ ఆటగానిగా వారి నిర్ణయానికి తలొగ్గడం తప్పా..ఏమి చేయలేని పరిస్థితి. అవకాశం ఎప్పుడు వచ్చినా బ్యాటుతోనే సమాధానం చెబుతా అని కరుణ్ అన్నాడు.

Story first published: Sunday, October 7, 2018, 16:18 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X