న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు నలుగురి భారత ఆటగాళ్ల బర్త్‌డే.. వారు ఎవరో తెలుసా!!?

BCCI Leads Wishes As Multiple Indian Cricket Stars Celebrate Birthdays


హైదరాబాద్:
టీమిండియా జట్టులోని నలుగురు ఆటగాళ్లు ఈరోజు (శుక్రవారం) బర్త్‌డే జరుపుకొంటున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌ బర్త్‌డేలు చేసుకుంటున్నారు. ఇలా ఒక జట్టులోని నలుగురు ఆటగాళ్లు ఒకేరోజు బర్త్‌డేలు జరుపుకోవడం విశేషం.

బీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. ఐపీఎల్‌ వేలంలో ముస్తాఫిజుర్‌!!బీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. ఐపీఎల్‌ వేలంలో ముస్తాఫిజుర్‌!!

 హ్యాపీ బర్త్‌డే బాయ్స్‌:

హ్యాపీ బర్త్‌డే బాయ్స్‌:

బర్త్‌డే సందర్భంగా నలుగురికి సోషల్ మీడియాలో బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. భారతదేశ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా ట్విట్టర్ వేదికగా వీరికి బర్త్‌డే విషెష్ తెలిపింది. మైదానంలో నలుగురు చేసిన సంబరాల వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. 'బర్త్‌డే బాయ్స్‌ నలుగురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జడేజా, బుమ్రా, శ్రేయస్, కరుణ్‌' అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా కేక్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది.

శుభాకాంక్షల వెల్లువ:

బర్త్‌డే సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంఛైజీలు, భారత ఆటగాళ్లు అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ రోజు బుమ్రా 26వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా తన 31, శ్రేయాస్ అయ్యర్ 25, కరుణ్ నాయర్ 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

తొలి టీ20లో జడేజా, అయ్యర్‌:

తొలి టీ20లో జడేజా, అయ్యర్‌:

వెస్టిండీస్‌తో ఈ రోజు రాత్రి జరిగే తొలి టీ20లో బర్త్‌డే బాయ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజాలు సన్నద్ధమవుతున్నారు. ఇద్దరికి తుది జట్టులో చోటుదక్కే అవకాశం ఉంది. ఉప్పల్‌ వేదికగా వెస్టిండీస్‌తో భారత్‌ తొలి టీ20 ఆడనున్న విషయం తెలిసిందే. బుమ్రా వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ సిరీసులకు అతడు అందుబాటులో లేడు.

 ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ మ్యాచ్‌:

ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ మ్యాచ్‌:

మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కరుణ్‌ నాయర్‌ రికార్డు సృష్టించాడు. 2016లో, చెపాక్‌ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. నాయర్ చివరిసారిగా 2017 మార్చి ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు.

Story first published: Friday, December 6, 2019, 16:20 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X