న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 6 వారాల్లో టీసీఏకు బీసీసీఐ సహచర సభ్యత్వం?

BCCI CoA gets six weeks to decide TCA membership

హైదరాబాద్: క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ)లో సహచర సభ్యత్వం పొందేందుకు టీసీఏ(తెలంగాణ క్రికెట్ అసోసియేషన్) దరఖాస్తు చేసుకుంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని క్రికెటర్లకు కూడా బీసీసీఐ నుంచి సహాయం అందనుంది. ఈ విషయంపై మరో ఆరు వారాల్లో చర్చించాల్సిందిగా ముంబై హైకోర్టును కోరింది.

గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీసీఏ బీసీసీఐలో సహచర సభ్యత్వం పొందేందుకు గల అర్హతలను హైకోర్టు సమక్షంలో వినిపించనున్నట్లు తెలిపింది. 2014వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ప్రత్యేక క్రికెట్ అసోసియేషన్ కావాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ చర్చలు ఫలిస్తే ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లుగా అవతరించనున్నాయి.

కొంతకాలంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఆంధ్ర ప్రాంతం నుంచే క్రికెటర్లను ఎన్నుకొని అసోసియేషన్‌ను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సహచర సభ్యత్వం కావాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ 2016 సంవత్సరం నుంచి 4దఫాలుగా అర్జీలు సమర్పించింది. ఇటీవలే మే3న జరిగిన చర్చల అనంతరం బీసీసీఐ కౌన్సిల్‌ ఆదర్శ సక్సేనా, అడ్వకేట్ భోసలే ఈ విషయంపై మరో ఆరు వారాల్లో నిర్ణయం ప్రకటించునున్నామని తెలిపారు.

ఒకవేళ టీసీఏ సభ్యత్వం పొందినట్లైతే ప్రత్యేకంగా ఏర్పాటైన రాష్ట్రం పుదుచ్చేరికి మాదిరిగానే సమాన హక్కులను పొందనుంది. దీనిపై స్పందించిన టీసీఎస్ సెక్రటరీ గురువా రెడ్డి తన హర్షాన్ని ఇలా వ్యక్తపరిచారు. బీసీసీఐలో సహచర సభ్యత్వం పొందితే తెలంగాణలోని గ్రామీణ క్రీడాకారులు సైతం వెలుగులోకి వస్తారని తెలిపారు. నైపుణ్యముండి ప్రదర్శించేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం రానుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

Story first published: Friday, May 11, 2018, 19:01 [IST]
Other articles published on May 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X