న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పుడు ధ్రువపత్రాలు: 8 మంది క్రికెటర్లపై వేటు వేసిన బీసీసీఐ

8 Puducherry Players Scrapped From Hazare Trophy
BCCI cancels registration of eight Puducherry players

హైదరాబాద్: తప్పుడు ధ్రువపత్రాలతో జాతీయ సీనియర్‌ జట్టులో చోటు సంపాదించిన ఎనిమిది మంది పాండిచ్చేరి క్రికెటర్లపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వేటు వేసింది. విజయ్‌హజారే టోర్నీలో భాగంగా ఉత్తరాఖండ్‌-పాండిచ్చేరి జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ టోర్నీలో ఆడుతున్న పాండిచ్చేరి జట్టులోని జేవియర్‌ నిఖిలేష్‌, ఇక్లాస్‌, అబ్దుల్‌ సఫర్‌, యశ్‌ జాదవ్‌, సాగర్‌ త్రివేది, అశ్‌హిత్‌ రాజీవ్‌, శశాంక్‌ సింగ్‌లు తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా పత్రాలు సమర్పించి జట్టులోకి వచ్చినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఎనిమిది మంది స్థానంలో మరో ఎనిమిది మంది ఆటగాళ్లను చేర్చుకునేలా పాండిచ్చేరి జట్టుకు బీసీసీఐ వెసులుబాటు కల్పించింది. దీంతో ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌కు ముందు రాత్రికి రాత్రే పుదుచ్చేరి ఏడుగురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.

విజయ్ హాజారే ట్రోఫీలో భాగంగా పాండిచ్చేరి జట్టు తన తొలి మ్యాచ్‌ని బుధవారం మణిపూర్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆ ఎనిమిది మంది ఆటగాళ్లు తప్పుడు ధ్రువపత్రాలతో జాతీయ సీనియర్‌ జట్టులో చోటు సంపాదించారని గుర్తించిన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Story first published: Friday, September 21, 2018, 14:01 [IST]
Other articles published on Sep 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X