ఆర్సీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి జట్టుగా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ గెలుపొందినా కానీ ఆర్సీబీ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో.. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి ఆటగాళ్లకు అత్యధిక సెంచరీలు(15) సమర్పించుకున్న మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు 14 సెంచరీలతో కోల్‌కతా నైట్ రైడర్స్ పేరిట ఉన్న ఈ రికార్డును ఆర్సీబీ అధిగమించి ఈ చెత్త రికార్డులో అగ్రస్థానానికి చేరుకుంది.
క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన సాయి సుదర్శన్
ఈ మ్యాచ్ కేవలం ఆర్సీబీకి చేదు జ్ఞాపకాన్ని మిగల్చడమే కాకుండా సాయి సుదర్శన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. సాయి సుదర్శన్ తన సెంచరీ ద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే సాయి సుదర్శన్ ఈ ఘనత సాధించి, దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు) రికార్డును తుడిచిపెట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో సుదర్శన్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నాడు.

గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ మొదటి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. గిల్ 32 పరుగులకు ఔట్ అయినప్పటికీ, సుదర్శన్ తన దూకుడును కొనసాగించి మూడో ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో జేసన్ హోల్డర్ 10 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు.
కోహ్లీ 'ఛేజ్ మాస్టర్' ఇన్నింగ్స్:
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ వెన్నెముకగా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ చేతిలో డకౌట్ గండం నుంచి తప్పించుకున్న కోహ్లీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు బాది జట్టును విజయం అంచులకు చేర్చాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవడంతో గుజరాత్ బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. ఆర్సీబీ ఈ లక్ష్యాన్ని 19వ ఓవర్లోనే పూర్తి చేసి మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సమర్పించుకున్న జట్లు:
ఆర్‌సీబీ (RCB): 15*
కేకేఆర్ (KKR): 14
ముంబై ఇండియన్స్ (MI): 14
సీఎస్‌కే (CSK): 11
ఎస్‌ఆర్‌హెచ్ (SRH): 11
బ్యాటింగ్ స్వర్గధామంగా భావించే చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ బౌలర్లు మరోసారి భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications