న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే సెంచరీ.. రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన తమీమ్‌ ఇక్బాల్‌!!

Bangladesh vs Zimbabwe: Tamim Iqbal smashes twin records after century

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకొంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో బంగ్లా 4 పరుగులతో జింబాబ్వేను ఓడించింది. బంగ్లా స్టార్ ఓపెనర్ తమీమ్‌ ఇక్బాల్‌ (136 బంతుల్లో 158; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సెలెక్టర్‌ షార్ట్‌లిస్ట్‌లో ప్రసాద్‌, శివరామకృష్ణన్‌.. అగార్కర్‌కు షాక్!!సెలెక్టర్‌ షార్ట్‌లిస్ట్‌లో ప్రసాద్‌, శివరామకృష్ణన్‌.. అగార్కర్‌కు షాక్!!

 వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌:

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌:

రెండో వన్డేలో తమీమ్‌ ఇక్బాల్‌ బంగ్లాదేశ్‌ తరపున ఓ రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. తమీమ్ 136 బంతుల్లో 158 పరుగులు చేసి బంగ్లా తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో తమీమ్ 132 పరుగులు చేసాడు. ఇప్పటివరకు ముష్ఫికర్‌ రహీమ్‌ చేసిన 144 పరుగులే అత్యధికం. ఇమ్రుల్ కాయెస్ (144), షకీబ్ అల్ హసన్ (132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 తొలి బంగ్లా క్రికెటర్‌గా తమీమ్:

తొలి బంగ్లా క్రికెటర్‌గా తమీమ్:

తమీమ్‌ బంగ్లాదేశ్‌ తరపున మరో ప్రపంచ రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో 7,000 పరుగులు సాధించిన తొలి బంగ్లా క్రికెటర్‌గా తమీమ్ రికార్డులోకి ఎక్కాడు. ప్రస్తుతం తమీమ్‌ ఖాతాలో 7,074 పరుగులు ఉన్నాయి. షకీబ్ అల్ హసన్ (6323), ముష్ఫికర్‌ రహీమ్‌ (6174), మొహ్మదుల్లా (4067) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక్బాల్‌ సెంచరీ:

ఇక్బాల్‌ సెంచరీ:

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ తమీమ్‌ ఇక్బాల్‌ సెంచరీ చేశాడు. వన్డేల్లో తమీమ్‌కు ఇది 12వ సెంచరీ. ముష్ఫికర్ రహీమ్ (55) హాఫ్ సెంచరీ చేయగా.. మహ్మదుల్లా (41), మహ్మద్ మిథున్ (32) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో కార్ల్ ముంబా, డోనాల్డ్ టిరిపానో చెరో రెండు వికెట్లు తీసారు.

జింబాబ్వే అనూహ్య ఓటమి:

జింబాబ్వే అనూహ్య ఓటమి:

అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. సికిందర్‌ రాజా (66; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మదెవెరె (52; 5 ఫోర్లు), తినాశే (51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. 15 పరుగులు చేయగలిగింది. టిరిపానో (28 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) 50వ ఓవర్‌ మూడు, నాలుగు బంతులను సిక్స్‌లుగా మలచడంతో జింబాబ్వే విజయం సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులకు మారింది. అయితే రెండు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన జింబాబ్వే అనూహ్యంగా ఓడింది.

Story first published: Wednesday, March 4, 2020, 10:12 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X