న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాపై అఫ్ఘాన్ సంచలన విజయం: చుక్కలు చూపించిన బర్త్‌డే బాయ్ రషీద్

ASIA CUP 2018 : Rasheed Khan's All-Round Show Helps Afghanistan Trounce Bangladesh
Bangladesh vs Afghanistan, Asia Cup 2018 Highlights: Afghanistan register massive 136 run win over Bangladesh

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌‌లో ఆసియా కప్‌లో పసికూన అఫ్ఘానిస్థాన్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. తమకంటే మెరుగైన ప్రత్యర్థిపై అద్భుత విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 136 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 255 పరుగులు చేసింది. అఫ్ఘాన్‌ ఇన్నింగ్స్‌లో హస్మతుల్లా ఖాన్ (58) నిలకడగా ఆడగా... రషీద్‌ ఖాన్‌ (32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 57 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. గురువారం 20వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న రషీద్‌ ఎడాపెడా బౌండరీలు బాదుతూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డ రషీద్ ఖాన్

బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డ రషీద్ ఖాన్

అస్మతుల్లా షాహిది (92 బంతుల్లో 3 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి గుల్బదీన్‌(38 బంతుల్లో 5 ఫోర్లతో 42 నాటౌట్‌) కూడా తోడవడంతో అఫ్ఘాన్‌ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. మిడిలార్డర్ వైఫల్యంతో 160 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖర్లో వచ్చిన రషీద్ ఖాన్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఎనిమిదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం

ఎనిమిదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం

ఫలితంగా చివరి 10 ఓవర్లలో రషీద్, గుల్బాదిన్ (42 నాటౌట్) 97 పరుగులు జత చేయడంతో బంగ్లా పోటీ ఇచ్చే స్కోరును నిర్దేశించింది. ఎనిమిదో వికెట్‌కు వీరిద్దరూ రికార్డుస్థాయిలో 95 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ ఉల్ హాసన్ 4 తీయగా, అబు హైడర్ 2 వికెట్లు తీశాడు.

 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్

256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్

అనంతరం 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ ఉల్‌ హసన్‌ 32 పరుగులతో జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మహ్మదుల్లా 27 పరుగులు చేయగా, మొసాదెక్‌ హుస్సేన్‌ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన బంగ్లా.. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది.

వరుస విరామాల్లో వికెట్లు తీసిన ఆప్ఘన్ బౌలర్లు

వరుస విరామాల్లో వికెట్లు తీసిన ఆప్ఘన్ బౌలర్లు

అఫ్ఘాన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచడంతో బంగ్లా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు లిట్టన్ దాస్ (6), నజ్ముల్ (7), మోమినల్ హక్ (9), మిథున్ (2) స్వల్ప విరామాల్లో ఔట్‌కావడంతో 79 పరుగులకే టాపార్డర్ పెవిలియన్‌కు చేరుకుంది. మధ్యలో షకీబ్ (32) కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా.. అఫ్ఘాన్ స్పిన్నర్లు బంతిని స్పిన్ చేయడంతో మరో ఎండ్‌లో అతడికి మద్దతిచ్చేవారు కరువయ్యారు.

ఆప్ఘన్ అద్భుత విజయం

ఆప్ఘన్ అద్భుత విజయం

మహ్మదుల్లా (27)తో ఐదో వికెట్‌కు షకీబ్ జోడించిన 36 పరుగులే పెద్ద భాగస్వామ్యం కావడం విశేషం. మ్యాచ్ చివర్లో మొసెద్దెక్ హుస్సేన్ (26 నాటౌట్) పరుగులు చేయకపోయినా బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ మూడు బంతుల తేడాలో అబు హైడర్ (1), రూబెల్ హుస్సేన్ (0)ను ఔట్ చేసి అఫ్ఘాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. అఫ్ఘాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌, గుల్బదీన్‌ నైబ్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

1
44051
Story first published: Friday, September 21, 2018, 8:53 [IST]
Other articles published on Sep 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X