న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉగ్రదాడి నేపథ్యంలో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మూడో టెస్టు రద్దు: స్వదేశానికి బంగ్లా క్రికెటర్లు

Bangladesh Team Narrowly Escaped A Major Incident | Oneindia Telugu
Bangladesh tour of New Zealand called off after Christchurch terror attack

హైదరాబాద్: న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పర్యటన అర్ధాంతరంగా రద్దు అయింది. న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.

న్యూజిలాండ్‌ మసీదులో కాల్పులు: బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదంన్యూజిలాండ్‌ మసీదులో కాల్పులు: బంగ్లా క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేస్తున్నట్లు కివీస్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని తెలియజేసింది. బంగ్లాదేశ్ బోర్డుతో చర్చించిన తర్వాతే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన హాగ్లే ఓవల్ టెస్టుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా క్షేమంగా ఉన్నారని ట్విట్టర్‌‌లో అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్ గడ్డపై మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఫిబ్రవరి 10న బంగ్లాదేశ్ జట్టు వెళ్లింది. సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు, రెండు టెస్టులు ముగియగా.. ఒక టెస్టు మాత్రమే మిగిలి ఉంది.

అది కూడా శనివారం నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా.. తాజాగా కాల్పుల నేపథ్యంలో.. ఆ టెస్టుని రద్దు చేస్తున్నట్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ప్రకటించాయి. ఉగ్రదాడి నుంచి బంగ్లాదేశ్‌ క్రికెటర్లు సురక్షితంగా బయటపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మొదటి రెండు టెస్టులను న్యూజిలాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్ ‌ను 2-0తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

హగ్లీపార్క్‌లో సమీపంలోని మజీదుపై ప్రార్థన సమయంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

నగరంలోని ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు

నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లా క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం.

బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా

బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి" అని తమీమ్ పేర్కొన్నాడు.

బంగ్లా కోచ్ మాట్లాడుతూ

మరోవైపు బంగ్లా కోచ్ మాట్లాడుతూ ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్‌ రహీమ్‌ ట్వీట్‌ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని అన్నాడు.

Story first published: Friday, March 15, 2019, 10:56 [IST]
Other articles published on Mar 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X