న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లీగల్ యాక్షన్ దిశగా!: షకీబ్‌కు ఊహించిన షాకివ్వనున్న బంగ్లా క్రికెట్ బోర్డు

Bangladesh Cricket Board To Take Legal Action On Shakib Al Hasan || Oneindia Telugu
Bangladesh Cricket Board may take legal action against Shakib al Hasan ahead of India tour

హైదరాబాద్: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన బంగ్లా క్రికెటర్లకు నేతృత్వం వహించిన ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాకివ్వనుందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. సెంట్రల్ కాంట్రాక్టుని ఉల్లంఘించినందుకు గాను షకీబ్ ఉల్ హాసన్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు సిద్ధమైంది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్‌‌లో ఉన్న జాతీయ స్థాయి క్రికెటర్‌ ఏ టెలికాం కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోకూడదు. అయితే, గ్రామీఫోన్ అనే టెలికాం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా షకీబ్ ఉల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో అతడిపై చట్టపరమైన తీసుకోవడానికి బోర్డు సిద్ధమైంది.

షూలేస్‌ కూడా కట్టుకోవడం సరిగా రానివారు ధోనీని విమర్శిస్తున్నారు: రవిశాస్త్రిషూలేస్‌ కూడా కట్టుకోవడం సరిగా రానివారు ధోనీని విమర్శిస్తున్నారు: రవిశాస్త్రి

షకీబ్ ఉల్ హాసన్ అతను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అన్నారు. గ్రామీఫోన్‌ టెలికాం సంస్థకు షకీబ్ ఉల్ హాసన్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు అక్టోబర్‌ 22వ తేదీన ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అదే సమయంలో బంగ్లా ఆటగాళ్ల సమ్మెకు షకీబ్ ఉల్ హాసన్ నాయకత్వం వహించడం... కొద్ది రోజుల్లోనే భారత పర్యటన ఉండటంతో చేసేది లేక ఆటగాళ్ల డిమాండ్లను నెరవేరువేర్చేందుకు బోర్డు ముందుకొచ్చింది. బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించారు.

ఇప్పుడు ఇది బంగ్లా క్రికెట్ బోర్డుకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆటగాళ్లను సమ్మెకు జీర్ణించుకోలేని బోర్డు సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్ ఉల్ హాసన్‌పై చర్యలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బోర్డు ఛీఫ్ నజ్ముల్ హాసన్ మాట్లాడుతూ "అతడు ఈ ఒప్పందం చేసుకోలేడు. ఎందుకంటే మా కాంట్రాక్ట్ పేపర్‌లో స్పష్టంగా చెప్పబడింది" అని తెలిపారు.

కోహ్లీ, విలియమ్సన్‌ను ఆదర్శంగా తీసుకుంటా: పాక్ టీ20 కెప్టెన్కోహ్లీ, విలియమ్సన్‌ను ఆదర్శంగా తీసుకుంటా: పాక్ టీ20 కెప్టెన్

"రోబీ మా టైటిల్ స్పాన్సర్, గ్రామీఫోన్ అసలు బిడ్ దాఖలు చేయలేదు. అందుకు బదులుగా వారు ఒకటి లేదా రెండు కోట్లు చెల్లించి కొంతమంది క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ప్రమోట్ చేయిస్తుంది. చివరికి ఏమి అయింది? దీని ద్వారా గత మూడేళ్లలో బోర్డు 90 కోట్లు కోల్పోయింది" అని బీసీబీ ఛీఫ్ నజ్ముల్ వెల్లడించారు.

"షకీబ్‌పై లీగల్‌ యాక్షన్‌ తీసుకోబోతున్నాం. మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబ్ పరిహారం చెల్లించుకోవాల్సింది. కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపాం" అని తెలిపారు.

క్యాబ్ స్పెషల్: సౌరవ్ గంగూలీ తన లైఫ్ సేవర్ అని పిలిచేది ఎవరినో తెలుసా?క్యాబ్ స్పెషల్: సౌరవ్ గంగూలీ తన లైఫ్ సేవర్ అని పిలిచేది ఎవరినో తెలుసా?

"దీనిపై షకీబ్‌కు వివరణ ఇవ్వాలని కోరతాం.. అతను నియమాన్ని ఉల్లంఘించలేదని చూపించడానికి మేము అతనికి అవకాశం ఇస్తాం. ఆ తర్వాత బోర్డుకు నష్టం కలిగించేలా ఉంటే.. అతడి నుంచి పరిహారం రాబట్టడంతో పాటు కఠినమైన చర‍్యలు తీసుకుంటాం" బీసీబీ చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ పేర్కొన్నారు.

Story first published: Saturday, October 26, 2019, 16:26 [IST]
Other articles published on Oct 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X