కెప్టెన్‌గా ధోని: బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ వరల్డ్ ఎలెవన్ జట్టిదే!

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ తన వరల్డ్ ఎలెవన్ జట్టుని ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. భారత్ నుంచి మొత్తం నలుగురు బ్యాట్స్‌మెన్లకు తన జట్టులో చోటు కల్పించాడు.

ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేసిన తమీమ్ ఇక్బాల్ నంబర్ త్రీ బ్యాట్స్‌మన్‌గా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. సెహ్వాగ్, సచిన్‌లు ఓపెనర్లుగా మొత్తం 114 మ్యాచ్‌లు ఆడి 4387 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. కోహ్లీ ఖాతాలో ఇప్పటికే 66 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఇక, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను ఎంచుకున్నాడు. పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా రెండు సార్లు వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.

అల్ రౌండర్లుగా కల్లిస్, షకీబ్

అల్ రౌండర్లుగా కల్లిస్, షకీబ్

అల్ రౌండర్లుగా జాక్వస్ కల్లిస్, షకీబ్ ఉల్ హాసన్‌లకు తమీమ్ ఇక్బాల్ చోటు కల్పించాడు. దక్షిణాప్రికాకు చెందిన జాక్వస్ కల్లిస్ అన్ని ఫార్మాట్లు కలిసి 24వేలకు పైగా పరుగులతో పాటు 670 వికెట్లు తీశాడు. షకీబ్ విషయానికి వస్తే 2007లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్‌లు ఆడాడు.

కెప్టెన్‌గా ధోనీ

కెప్టెన్‌గా ధోనీ

తమీమ్ ఇక్బాల్ తన జట్టుకు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేశాడు. 28 ఏళ్ల తర్వాత భారత జట్టు రెండోసారి ప్రపంచకప్‌ను నెగ్గడంలో మహేంద్ర ధోని కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోని 91 పరుగులు చేసిన భారత జట్టు రెండోసారి వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

స్పెషలిస్ట్ బౌలర్‌గా మెక్‌గ్రాత్

స్పెషలిస్ట్ బౌలర్‌గా మెక్‌గ్రాత్

ఫాస్ట్ బౌలర్లుగా పాక్ మాజీ క్రికెట్ దిగ్గజాలు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్‌లను ఎంపిక చేశాడు. అక్రమ్ వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టగా... అక్తర్ 30 వరకు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో మెక్‌గ్రాత్‌ను స్పెషలిస్ట్ బౌలర్‌గా తీసుకున్నాడు.

ఏకైక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్

ఏకైక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్

తన వరల్డ్‌కప్ జట్టులో ఇక్బాల్ ఒకే ఒక స్పిన్నర్‌కు చోటు కల్పించాడు. అతడే శ్రీలంకకు చెందిన స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో మొత్తం 40 మ్యాచ్‌లు ఆడిన ముత్తయ్య మురళీధరన్ 68 వికెట్లు పడగొట్టాడు.

తమీమ్ ఇక్బాల్ వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టు:

తమీమ్ ఇక్బాల్ వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టు:

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్, షకీబ్ ఉల్ హాసన్, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, September 13, 2019, 15:04 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X