న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యో రామ.. 'షూ' కారణంగా ఔట్ అయిన బ్యాట్స్‌మన్‌!క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి!వీడియో చూస్తే నవ్వులే!

Bangladesh Batsman Taijul Islam Got Out When His Shoe Knocked Off The Stumps Bails

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు, రనౌట్‌లు చేస్తుంటారు. వికెట్‌ కీపర్లు మెరుపు వేగంతో స్టంపింగ్‌లు, క్యాచ్‌లు అందుకుంటారు. ఓ బౌలర్ అద్భుత బంతితో బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తాడు. ఇవేమి కాకుండా బ్యాట్స్‌మన్‌ హిట్ వికెట్ రూపంలో కూడా పెవిలియన్ చేరుతుంటాడు. హిట్ వికెట్ అయిన బ్యాట్స్‌మన్‌ అదుపుతప్పడంతో ఔట్ అవుతుంటాడు. అయితే 'షూ' కారణంగా ఔట్ అవ్వడం బహుశా క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు. వివరాల్లోకి వెళితే..

Veda Krishnamurthy:పెను విషాదం..కరోనాతో వేద కృష్ణమూర్తి సోదరి కన్నుమూత! తల్లి కూడా!Veda Krishnamurthy:పెను విషాదం..కరోనాతో వేద కృష్ణమూర్తి సోదరి కన్నుమూత! తల్లి కూడా!

కాలి షూ ఓడిపోవడంతో:

కాలి షూ ఓడిపోవడంతో:

తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య పల్లెకెల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ (రెండో టెస్ట్) జరిగింది. రెండో టెస్టులో 3వ రోజు బంగ్లా 251 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అప్పటికి లంక మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు బంగ్లా 242 పరుగుల వెనుకబడి ఉంది. సురంగ లక్మల్ వేసిన 82వ ఓవర్ చివరి బంతికి తైజుల్ ఇస్లాం స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. లక్మల్ బంతి వేయగానే ఇస్లాం మామూలుగానే బ్యాక్ ఫుట్ తీసుకుని.. డిఫెన్సివ్ షాట్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ అయిన ఇస్లాం ఎడమ కాలి షూ ఓడిపోవడంతో.. కాలు అదుపుతప్పి వికెట్లను తాకింది. ఇంకేముంది ఇస్లాం హిట్ వికెట్ ఔట్ అయ్యాడు.

క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి:

తైజుల్ ఇస్లాం షాట్ ఆడిన అనంతరం సింగల్ కోసం ప్రయత్నించాడు. అయితే లంక ఆటగాళ్లు హిట్ వికెట్ అవ్వడంతో బంతి కోసం వెళ్ళలేదు. ఇది చూసిన ఇస్లాం హిట్ వికెట్ అయ్యానని గ్రహించి షూ వేసుకుని పెవిలియన్ చేరాడు. ఇస్లాం 50 బంతుల్లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ నవ్వులతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'దురదృష్టకరమైన ఔట్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇలా ఔట్ అవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి' అని ఇంకొకరు అన్నారు.

శ్రీలంక ఘన విజయం:

శ్రీలంక ఘన విజయం:

రెండో టెస్టులో శ్రీలంక 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన లంక మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లను 493 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు కరుణ రత్నే (118), తిరిమన్నే (140) సెంచరీలు చేయగా.. ఫెర్నాండో (81), డిక్ వెళ్లా (77) హాఫ్ సెంచరీలు చేశారు. మొడటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 251 పరుగులకే ఆలౌట్ అయింది. లక్మల్ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో లంక 9 వికెట్లకు 194 రన్స్ వద్ద మరోసారి డిక్లేర్ చేసింది. 400లకు పైగా ఛేదనలో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంక ఘన విజయం సాధించింది. మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది.

Story first published: Thursday, May 6, 2021, 16:33 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X