న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతిపై దాన్ని పూయడాన్ని నిరోధించలేము, అంపైర్లకు కష్టమే: ఆసీస్ స్పీడ్‌స్టర్ హాజల్‌వుడ్

Ban on Saliva on Cricket ball will make no big difference,but its hard to monitor:Josh Hazlewood

సిడ్నీ: క్రికెట్ బంతిపై లాలాజలం రాస్తే ఆ ఆటగాడిని క్రికెట్ నుంచి నిషేధించాలనే ప్రతిపాదనతో తాను ఏకీభవించడం లేదని చెప్పాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజల్‌వుడ్. ఫలానా ఆటగాడు లాలాజలం రాశాడో లేదో కనిపెట్టడం కష్టం అవుతుందని అయినప్పటికీ దీంతో పనిలేకుండానే బాల్ స్వింగ్ చేయొచ్చని అభిప్రాయపడ్డాడు. లాలాజలం రాస్తే బంతి మెరుస్తుందే తప్ప స్వింగ్ విషయంలో పెద్ద తేడా కనిపించదని చెప్పాడు. కరోనావైరస్ నుంచి పరిస్థితులు చక్కబడ్డాక బంతిపై ఉమ్మి రాయడం లేదా లాలాజలం రాయడం వంటివి చేయకుండా నిబంధనలు తీసుకొస్తామని ఈ మధ్యనే ఐసీసీ ప్రతిపాదించింది. లాలాజలం బంతికి రాయడం వలన కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిపై నిషేధం విధించాలని ఐసీసీ భావిస్తోంది.

ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాలుగా బంతిని మెరిపించేందుకు క్రికెటర్లు లాలాజలంను వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల బంతి బాగా స్వింగ్ అవుతుందని భావిస్తారు. బ్యాట్స్‌మెన్ వద్దకు బంతి వెళ్లినప్పుడు గాల్లో కదలికలను మారుస్తుంది. మరోవైపు లాలాజలం కాకుండా చెమట పూసేందుకు అనుమతి ఇచ్చింది ఐసీసీ. చెమట ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఫలానా ఆటగాడు బంతికి లాలాజలం రాశాడా లేదా అని అంపైర్లు కనిపెట్టడం చాలా కష్టమవుతుందని హాజల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు.

తన వరకు మాత్రం లాలాజలంను బంతిపై రాసేందుకే ఇష్టపడతానని హాజల్‌వుడ్ చెప్పాడు. అందరూ ఈ పద్ధతి పై నిషేధం విధించినట్లయితే ఈ అలవాటు నుంచి బయటపడటం చాలా కష్టమవుతుందని వెల్లడించాడు. ఒక బౌలర్‌కు ఉన్న సాధారణ అలవాటు బంతిపై లాలాజలం పూయడమని చెప్పాడు. అంటే బంతిపై ఏదైనా ఉంటే దాన్ని తొలగించే క్రమంలో లాలాజలం ఉపయోగించడం సర్వసాధారణమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో దాన్ని మానిటర్ చేయడం అంపైర్లకు చాలా కష్టతరంగా మారుతుందని వెల్లడించాడు. ఇక మ్యాచ్ జరిగే సమయంలో బంతి మైదానంలో ఉన్న పలు ఆటగాళ్ల వద్దకు వెళుతుందని అలాంటి సమయాల్లో అలవాటులో భాగంగా లాలాజలం పూస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు హాజల్‌వుడ్.

Story first published: Wednesday, May 20, 2020, 10:18 [IST]
Other articles published on May 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X