Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ టాంపరింగ్: ప్రపంచ క్రికెట్‌ చవిచూసిన మునుపటి వివాదాలివే

Ball-Tampering: Previous controversies that rocked the cricket world
Steve Smith Ball tampering scandal : Cricket fraternity expresses disappointment | Oneindia News

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌.. గత మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్‌ను కుదిపేస్తోన్న వివాదాస్పద అంశం. బంతి ఆకారాన్ని అక్రమ మార్గాల ద్వారా ఉద్దేశపూర్వకంగా చెడగొట్టడాన్నే బాల్‌ టాంపరింగ్‌ అంటారు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌ బంతి స్వరూపాన్ని మారుస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోవడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి చోటుచేసుకోవడం ఇదే తొలిసారా? అంటే కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. క్రికెట్లో ఎప్పటి నుంచో నలుగుతున్న మాటిది. జెంటిల్మన్‌ గేమ్‌గా చెప్పుకొనే క్రికెట్‌లో 70వ దశకంలోనే టాంపరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అయితే, 2000లో పాకిస్థాన్ క్రికెటర్ వకార్‌ యూనిస్‌ తొలిసారిగా ఈ నిషేధం బారినపడ్డాడు.

మ్యాచ్‌లో తమకు విజయావకాశాలు సంక్లిష్టంగా మారినప్పుడు ఆటగాళ్లు ఇలా బంతిని ఏదో రకంగా టాంపరింగ్‌ చేస్తుంటారు. బంతిని గరుకుగా చేయడం ద్వారా రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా మారి ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసేందుకు వీలుచిక్కుతుంది. ఇప్పటిదాకా వెలుగుచూసిన బాల్‌ టాంపరింగ్‌ ఉదంతాలను ఓసారి పరిశీలిస్తే...

జాన్‌ లేవర్‌ (ఇంగ్లాండ్‌, 1977)

జాన్‌ లేవర్‌ (ఇంగ్లాండ్‌, 1977)

భారత్‌తో జరిగిన తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ లేవర్‌ అదనపు స్వింగ్‌ కోసం బంతి స్వరూపాన్ని మార్చినట్టు తొలిసారిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జాన్‌ లేవర్‌ స్వింగ్‌ కోసం బంతికి ఓవైపు వాజెలిన్‌ను ఉపయోగించాడని నాటి కెప్టెన్‌ బేడీ ఆరోపించాడు. భారత్‌ అతడిపై ఫిర్యాదు చేసినా లేవర్‌పై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఆ టెస్టులో లేవర్‌ పది వికెట్లు తీశాడు.

ప్రింగిల్‌, మార్టిన్‌ క్రో (న్యూజిలాండ్‌, 1990)

ప్రింగిల్‌, మార్టిన్‌ క్రో (న్యూజిలాండ్‌, 1990)

పాకిస్థాన్‌తో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు క్రిస్‌ ప్రింగిల్‌-మార్టిన్‌ క్రో బాటిల్‌ క్యాప్‌తో బంతి ఆకారాన్ని మార్చారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకున్నా రిటైర్మెంట్‌ అనంతరం తాము చేసిన టాంపరింగ్‌ను ఈ ఇద్దరూ అంగీకరించడం విశేషం.

మైక్‌ అథర్టన్‌ (ఇంగ్లాండ్‌, 1994)

మైక్‌ అథర్టన్‌ (ఇంగ్లాండ్‌, 1994)

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కెప్టెన్‌ అథర్టన్‌ తన జేబులో నుంచి ఏదో వస్తువును తీసి బంతిని అదేపనిగా రుద్దాడు. ప్యాంటులో మట్టి దాచుకుని బంతిని రుద్దుతూ అతను కెమెరాలకు దొరికిపోయాడు. అయితే తాను బంతిపై ఉన్న మట్టిని తుడిచానంటూ టాంపరింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చాడు. తన చేతులు గరుకుగా ఉంచుకునేందుకే ఇలా చేసినట్లు ఆ తర్వాత అథర్టన్‌ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ బాల్ టాంపరింగ్ వివాదంలో అతడు 2వేల పౌండ్లు జరిమానాగా చెల్లించాడు.

వకార్‌ యూనిస్‌ (పాకిస్థాన్‌, 2000)

వకార్‌ యూనిస్‌ (పాకిస్థాన్‌, 2000)

శ్రీలంకతో వన్డేలో పాక్‌ పేసర్‌ వకార్‌ బొటనవేలి గోరుతో బంతిని గీకుతూ కనిపించాడు. దీంతో అతడిపై ఓ వన్డే నిషేధం పడింది. అలాగే తొలిసారిగా బాల్‌ టాంపరింగ్‌ కారణంగా వేటు పడిన ఆటగాడిగానూ పేరు తెచ్చుకున్నాడు. అంతకముందు 1992లో లార్డ్స్‌ టెస్టులో పాక్ పేసర్లు అక్రమ్‌, వకార్‌ కూల్ డ్రింక్ ఓపెనర్‌ సాయంతో బంతి ఆకారాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలొచ్చాయి. డ్యూక్‌ బంతి ఎక్కువగా రివర్స్‌ స్వింగ్‌ కావడానికే వాళ్లలా చేశారని ఇంగ్లాండ్‌ విమర్శించింది. ఈ వివాదం అక్రమ్‌, వకార్‌లను చాలాకాలం వెంటాడింది.

సచిన్‌ టెండూల్కర్ (భారత్‌, 2001)

సచిన్‌ టెండూల్కర్ (భారత్‌, 2001)

దక్షిణాఫ్రికాతో టెస్టులో సచిన్‌ టెండూల్కర్ బంతిపై గోళ్లతో గీకినట్టుగా ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. దీంతో సచిన్‌పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో 75 శాతం జరిమానా విధించారు. అయితే తాను బంతిపై ఉన్న మురికిని మాత్రమే తీశానని సచిన్‌ చెప్పడంతో తీవ్రంగా ఆగ్రహించిన బీసీసీఐ మూడో టెస్టును బాయ్‌కాట్‌ చేసింది. ఆ తర్వాత రిజర్వ్‌ జట్టును దించి అనధికారిక టెస్టు ఆడింది. ఆ తర్వాత సచిన్‌ దోషి కాదని, అయితే అంపైర్‌ అనుమతి లేకుండా బంతిని శుభ్రం చేయడం సరికాదని ఐసీసీ పేర్కొంది.

రాహుల్‌ ద్రావిడ్‌ (భారత్‌, 2004)

రాహుల్‌ ద్రావిడ్‌ (భారత్‌, 2004)

జింబాబ్వేతో జరిగిన వన్డేలో రాహుల్‌ ద్రవిడ్‌ నోటి లాలాజలంతో బంతి ఓవైపునకు పదేపదే రుద్దడంతో మ్యాచ్‌ రెఫరీ క్లైవ్‌ లాయిడ్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించాడు.

షాహిద్‌ అఫ్రీది (పాకిస్థాన్‌, 2010)

షాహిద్‌ అఫ్రీది (పాకిస్థాన్‌, 2010)

2010లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ అఫ్రిది మరో కొత్త కోణం చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో పాక్‌ ఆల్‌రౌండర్‌ అఫ్రీది బంతిని తన నోటితో కొరికి బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నంచడం టీవీల్లో అభిమానులందరూ చూశారు. దీంతో రెండు టీ20 మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

డుప్లెసిస్‌ (దక్షిణాఫ్రికా, 2013)

డుప్లెసిస్‌ (దక్షిణాఫ్రికా, 2013)

ప్రస్తుత దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ రెండుసార్లు టాంపరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో డుప్లెసిస్‌ తన ప్యాంట్‌కు ఉన్న జిప్‌తో బంతి ఆకారాన్ని మార్చాడు. దీంతో అంపైర్లు పాక్‌కు అదనంగా ఐదు పరుగులిచ్చి డుప్లెసిస్‌కు 50శాతం జరిమానా విధించారు. మళ్లీ మూడేళ్ల తర్వాత 2016లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో చూయింగ్‌ గమ్‌ ఉమ్మిని తీసి బంతిపై రుద్దినందుకు డుప్లెసిస్‌పై వంద శాతం జరిమానా విధించారు.

కామెరూన్ బాన్‌క్రాప్ట్ (ఆస్ట్రేలియా, 2018)

కామెరూన్ బాన్‌క్రాప్ట్ (ఆస్ట్రేలియా, 2018)

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. తన ప్యాంట్ జేబులోంచి పసుపు రంగు పదార్థంతో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. బెన్‌క్రాఫ్ట్‌ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం.. ఆ సన్నివేశాలను టీవీలో చూపించడంతో కోచ్‌ డారెన్‌ లెహమాన్‌ అప్రమత్తమై డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లతో వాకీటాకీలో మాట్లాడటం, వారి నుంచి సలహాలు తీసుకున్న బెన్‌క్రాఫ్ట్‌ తన వద్ద ఉన్న టేపును ఫ్యాంటు లోపల వేసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. వీటన్నింటినీ సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్‌ కెమెరామెన్ జోటని ఆస్కార్‌ తన కెమెరాతో బంధించడంతో ఈ బాల్ టాంపరింగ్ వివాదం వెలుగులోకి వచ్చింది.

Story first published: Tuesday, March 27, 2018, 13:21 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+