Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs KKR: అంగ్‌క్రిష్ రఘు వంశీ ఔట్‌పై దుమారం.. అంపైర్లపై కేకేఆర్ ఆగ్రహం(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘు వంశీ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో అబ్‌స్టక్టింగ్ ది ఫీల్డ్ రూల్ కింద అంగ్‌క్రిష్ రఘు వంశీ పెవిలియన్ చేరాడు. అయితే ఈ నిర్ణయంపై కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో పాటు ఓనర్ వెంకీ మైసూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

కేకేఆర్ బ్యాటింగ్ సందర్భంగా ప్రిన్స్ యాదవ్ వేసిన 5వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని రఘువంశీ మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ కామెరూన్ గ్రీన్ నిరాకరించాడు. దాంతో సగం క్రీజు ధాటికి రఘువంశీ యూటర్న్ తీసుకొని వెనక్కివెళ్లిపోయాడు. బంతిని అందుకున్న మహహ్మద్ షమీ..రిషభ్ పంత్‌‌కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త రఘువంశీకి తాకింది. అప్పటికీ అతను క్రీజుకు చేరుకోకపోవడంతో అబ్‌‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ రూల్ ఔట్ కోసం పంత్, షమీ అప్పీల్ చేశారు.

IPL 2026 Abhishek Nayar Furious Clash With Umpire Over Raghuvanshi s Dismissal Goes Viral
Photo Credit: twitter (X)

ఫీల్డ్ అంపైర్లు.. మూడో అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి రఘువంశీని ఔట్‌గా పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా రఘువంశీ బంతికి అడ్డుపడకపోయినా అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ రూల్ కింద ఎలా ఔటిస్తారని కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే రఘు వంశీ బంతి గమనాన్ని చూసే డైరెక్షన్ మార్చుకొని పరుగెత్తాడని భావించిన థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఔట్ అంటే మరికొందరు కాదంటున్నారు.

అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ ఏంటంటే..?

మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నియమం 37 ప్రకారం.. ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా తన మాటలతో లేదా చేతలతో ఫీల్డింగ్ జట్టును అడ్డుకున్నా లేదా వారి ఏకాగ్రతను దెబ్బతీసినా 'ఔట్'గా పరిగణిస్తారు. వికెట్లకు బంతి తగలకుండా అడ్డుకోవడానికి తమ రన్నింగ్ మార్గాన్ని మార్చుకోవడం, రనౌట్ లేదా క్యాచ్‌ను అడ్డుకోవడానికి బ్యాట్ లేదా శరీరాన్ని అడ్డుపెట్టడం, ఫీల్డర్ అనుమతి లేకుండా బంతిని చేత్తో పట్టుకుని వారికి అందించడం వంటి ఘటనలను అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్‌గా పరిగణించి ఔటిస్తారు.

Story first published: Sunday, April 26, 2026, 23:19 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+