IPL 2026: లక్నో కొంపముంచిన పూరన్.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మరో సంచలన విజయాన్నందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన లోస్కోర్ థ్రిల్లర్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. కీలక సూపర్ ఓవర్‌లో నికోలస్ పూరన్ వైఫల్యం లక్నో కొంపముంచగా.. రింకూ సింగ్ అద్వితీయమైన ప్రదర్శన కేకేఆర్‌కు విజయాన్నందించింది. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ బాదడంతో పాటు ఫీల్డింగ్‌లో రింకూ సింగ్ ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. రింకూ సింగ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 3 సిక్స్‌లతో 34) పర్వాలేదనిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్(5/23) ఐదు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31), రిషభ్ పంత్(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42), ఆయుష్ బదోని(19 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/24), వరుణ్ చక్రవర్తీ(2/33) రెండేసి వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగీ తలో వికెట్ తీసారు.
షమీ సిక్సర్‌తో టై..
ఆఖరి ఓవర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగీ తొలి ఐదు బంతుల్లో రెండు నోబాల్స్‌తో సహా ఒక వికెట్ తీసి 10 పరుగులిచ్చాడు. ఆఖరి బంతికి షమీ సిక్సర్ బాదడంతో స్కోర్లు టై అయ్యాయి.
కొంపముంచిన పూరన్..
సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్‌లో తొలి బంతికే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో బంతికి పంత్ సింగిల్ తీసియగా.. మూడో బంతికి మార్క్‌రమ్ రోవ్‌మన్ పోవెల్ స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో లక్నో సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగిసింది. బౌండరీ లైన్‌పై పోవెల్ అద్భుతంగా అందుకొని సమయన్వయం కోల్పోవడంతో చాకచక్యంగా మైదానం లోపల ఉన్న రింకూ సింగ్‌కు అందించాడు.
దాంతో 2 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్ బరిలోకి దిగిన కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్.. తొలి బంతినే బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఫామ్‌లో లేని నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు పంపించి లక్నో సూపర్ జెయింట్స్ మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications