దేవుడున్నాడు! తొండాట ఆడితే ఫలితం ఇలానే ఉంటుంది పంత్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవరాల్‌గా ఆరో ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది.
లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ చెత్త నిర్ణయాలతో మూల్యం చెల్లించుకుంది. సూపర్ ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను బ్యాటింగ్ పంపించడం లక్నోకు నష్టం చేసింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తొండాట ఆడితే ఫలితం ఇలానే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీని అన్యాయంగా ఔట్ చేశారని మండిపడుతున్నారు. అంగ్‌క్రిష్ రఘువంశీ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ కింద ఔటైన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా ఫీల్డర్‌కు ఆటంకం కలిగించాడని అంపైర్లు ఔటిచ్చారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది.

అసలేం జరిగిందంటే..?
కేకేఆర్ బ్యాటింగ్ సందర్భంగా ప్రిన్స్ యాదవ్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని రఘువంశీ మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ నాన్‌స్ట్రైకర్ కామెరూన్ గ్రీన్ నిరాకరించాడు. దాంతో సగం క్రీజు ధాటిన రఘువంశీ యూటర్న్ తీసుకొని వెనక్కివెళ్లిపోయాడు.
బంతిని అందుకున్న మహహ్మద్ షమీ..రిషభ్ పంత్‌కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త రఘువంశీకి తాకింది. అప్పటికీ అతను క్రీజుకు చేరుకోకపోవడంతో అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ రూల్ ఔట్ కోసం పంత్, షమీ అప్పీల్ చేశారు.
బంతికి అడ్డుగా పరుగెత్తాడని..
ఫీల్డ్ అంపైర్లు.. మూడో అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి రఘువంశీని ఔట్‌గా పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా రఘువంశీ బంతికి అడ్డుపడకపోయినా అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ రూల్ కింద ఎలా ఔటిస్తారని కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
అయితే రఘు వంశీ బంతి గమనాన్ని చూసే డైరెక్షన్ మార్చుకొని పరుగెత్తాడని అంపైర్లు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వివాదాస్పద నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది అన్యాయమని, రఘువంశీకి బంతి తాకకపోయినా రనౌట్ అయ్యేవాడు కాదని కేకేఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
దేవుడున్నాడు..
అన్యాయంగా రఘువంశీని ఔట్ చేయడంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓటమిపాలైందని మండిపడుతున్నారు. దేవుడున్నాడని, తొండాట ఆడితే విజయాలు దక్కవని రిషభ్ పంత్‌కు చురకలంటిస్తున్నారు. పాపం చేస్తే పాతాళానికే అని మరోసారి రుజువైందని కామెంట్ చేస్తున్నారు. అంగ్‌క్రిష్ రఘువంశీ కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పెవిలియన్ ధాటిన వెంటనే బ్యాట్‌ను నేలకు కొడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications