Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్లకే వరల్డ్ క్లాస్ బ్యాటింగ్.. మరో 25 ఏళ్లు ఈ బుడ్డోడిదే: మహమ్మద్ కైఫ్

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 15 ఏళ్ల‌కే వరల్డ్ క్లాస్ బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడని, గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా విధ్వంసం సృష్టిస్తున్నాడని కొనియాడాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన మహమ్మద్ కైఫ్.. జియో హాట్‌స్టార్ షోలో అతన్ని ఆకాశానికెత్తాడు. వైభవ్ ఫిట్‌గా ఉండి ఇదే జోరు కొనసాగిస్తే భారత క్రికెట్‌ను మరో 25 ఏళ్ల పాటు శాసిస్తాడని జోస్యం చెప్పాడు. అతని ధాటికి వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా తేలిపోతున్నారని చెప్పుకొచ్చాడు.

వైభవ్ తరానికొక్కడు..

'వైభవ్ సూర్యవంశీ అరుదైన ప్రతిభావంతుడు. అతనిలాంటి ఆటగాళ్లు తరానికొక్కరే ఉంటారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లోని అత్యుత్తమ బౌలర్లను సైతం సాధారణ బౌలర్లుగా మారుస్తున్నాడు. పాట్ కమిన్స్ వేసిన తొలి బంతినే ఈ కుర్రాడు భారీ సిక్సర్‌గా మలిచాడు.

గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా ఐపీఎల్‌ను శాసిస్తున్నాడు. అతనికి భయం అంటే ఏంటో కూడా తెలియదు. రెండు సీజన్లలో రెండు సెంచరీలు సాధించాడు. అది కూడా 250 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో. అతని మానసిక దృక్పథం గురించి చెప్పడానికి ఇది చాలు. బౌలర్ పేరును కానీ, మ్యాచ్ పరిస్థితిని కానీ అతను పట్టించుకోవడం లేదు. కేవలం ఎదురు దాడి చేస్తూనే ఉన్నాడు.

25 ఏళ్ల ఏలుతాడు..

పదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న ఆటగాడిలా అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతి లెంగ్త్‌ను ముందుగానే పసిగట్టడం.. క్రీజులో అతని బ్యాలెన్స్, అపారమైన శక్తి.. ఇవన్నీ వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఉన్నాయి. అంతేకాదు అతని పరిణతి కూడా అద్భుతం. ఇంత చిన్న వయస్సులోనే అతను చాలా ప్రశాంతమైన ఆలోచనలతో ఆడుతుండటం అద్భుతం. అతను ఫిట్‌గా ఉండి.. అదే పట్టుదలతో తన లక్ష్యంపై దృష్టి పెడితే.. భారత క్రికెట్‌కు రాబోయే 20 నుంచి 25 ఏళ్ల పాటు సేవలందించే తదుపరి సూపర్ స్టార్ దొరికినట్టే.’అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

మరో సచిన్..

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌నున భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా కొనియాడాడు. అతన్ని సచిన్ టెండూల్కర్‌తో పోల్చాడు. వైభవ్ తదుపరి భారత సంచలనంగా మారవచ్చని అభిప్రాయపడ్డాడు. 'నేను 1989లో కెప్టెన్‌గా పర్యటనకు వెళ్ళినప్పుడు.. నాతో పాటు 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఈ రోజు అతను క్రికెట్ గాడ్. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ కూడా తదుపరి తరానికి ఆరాధ్య దైవం కాగలడు. ఈ కుర్రాడికి అద్భుతమైన ప్రతిభ ఉంది.’అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 26, 2026, 22:07 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+