Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.27 కోట్ల జీతం.. 27 పైసల ఆట!.. ఇజ్జత్ పాయే!!

స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు పోరాడినా చివరికి ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో లక్నో వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రిషభ్ పంత్ నిర్ణయాలు, జట్టు వైఫల్యాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.27 కోట్లు బొక్కా..
ఈ సీజన్ వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో లక్నో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్.. తన ధరను సమర్థించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన రిషభ్ పంత్.. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్‌గా కూడా జట్టును సరైన దిశలో నడిపించలేకపోతున్నాడు. ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో లక్నో జట్టు కేవలం 1 పరుగు మాత్రమే చేయడం, అందులో రిషభ్ పంత్ పాత్రపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "కోట్ల జీతం తీసుకుంటున్నావు కానీ, ప్రదర్శన మాత్రం దానికి దరిదాపుల్లో కూడా లేదు" అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rishabh Pant Trolled 27 Crore Salary 27 Paise Performance LSG Struggles in IPL 2026 Season

మాకు విశ్రాంతి కావాలి: రిషభ్ పంత్ ఆవేదన
వరుస పరాజయాలతో కుంగిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ అనంతరం భావోద్వేగంగా స్పందించాడు. జట్టుకు ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ఓ విరామం అవసరమని రిషభ్ పంత్ అభిప్రాయపడ్డాడు. ఈ గ్యాప్‌లో జట్టు లోపాలను సరిదిద్దుకుని, సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తామని రిషభ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఒత్తిడి అనేది ఆటలో భాగమని.. అయితే దానికి పరిష్కారాలు బయట ఎక్కడో కాకుండా జట్టు లోపలే వెతుక్కోవాలని.. ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యతను గుర్తించాలని రిషభ్ పంత్ సూచించాడు.

వ్యూహాత్మక తప్పిదాలు, విమర్శలు
ఈ మ్యాచ్‌లో లక్నో చేసిన కొన్ని నిర్ణయాలు క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యపరిచాయి. ప్రధాన బౌలర్ మొహ్సిన్ ఖాన్ 5 వికెట్లతో కేకేఆర్ బ్యాటర్లను వణికించినప్పటికీ.. కీలకమైన సూపర్ ఓవర్‌లో అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడం రిషభ్ పంత్ చేసిన అతిపెద్ద తప్పిదంగా నెటిజన్లు భావిస్తున్నారు. అలాగే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ కు పంపడంపై రిషభ్ పంత్ వివరణ ఇస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

రింకూ సింగ్ సూపర్ షోపై రహానే ప్రశంసలు
మరోవైపు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తమ విజయం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఒక దశలో 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమ జట్టును రింకూ సింగ్ తన అద్భుతమైన 83 పరుగుల ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడని రహానే కొనియాడాడు. చివరి ఓవర్లలో రింకూ బాదిన వరుస సిక్సర్లు మ్యాచ్ రూపురేఖలను మార్చేశాయని.. ఆ అసాధారణ పోరాటమే తమకు విజయాన్ని అందించిందని రహానే పేర్కొన్నాడు. ఎకానా స్టేడియంలోని కఠినమైన పిచ్ పై రింకూ ఆడిన తీరు కేకేఆర్ కు పెద్ద సానుకూల అంశమని రహానే ముగించాడు.

Story first published: Monday, April 27, 2026, 11:06 [IST]
Other articles published on Apr 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+