ఈ విజయం ఆయనకు అంకితం.. కన్నీళ్లు పెట్టుకున్న రింకూ సింగ్ భార్య! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం ఓ అద్భుతమైన పోరాటానికి వేదికైంది. లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించింది. ఈ విజయానికి వెన్నెముకగా నిలిచిన రింకూ సింగ్.. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించి జట్టును గట్టెక్కించాడు. అయితే ఈ ఆనంద సమయంలో రింకూ సింగ్ కుటుంబంలో నెలకొన్న ఓ విషాద ఛాయ అందరినీ కలచివేసింది. మైదానంలో రింకూ సింగ్ సంచలనం సృష్టిస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ఆయన సతీమణి ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విజయం నా మామగారికి అంకితం: ప్రియా సరోజ్
మ్యాచ్ గెలిచిన అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. అందులో ప్రియా సరోజ్ మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ప్రియా సరోజ్ మాట్లాడుతూ.. "రింకూ ఆదివారం ఆడిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ నా మామగారికి అంకితం. ఈ విజయాన్ని చూసి ఆయన ఎంతో గర్వపడేవారు. నిజానికి ఈ క్షణాన మేమందరం ఆయన్న చాలా మిస్సవుతున్నాం" అని ప్రియా సరోజ్ పేర్కొన్నారు. రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ గత ఫిబ్రవరిలో లివర్ క్యాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. తండ్రి మరణించిన కొద్ది నెలలకే రింకూ సింగ్ పట్టుదలతో మైదానంలోకి వచ్చి ఇలాంటి ప్రదర్శన చేయడం చూసి ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

వైస్ కెప్టెన్ బాధ్యతాయుత పోరాటం
ఈ కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ తన హోదాకు తగ్గట్టుగా రాణించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టుకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. వరుసగా వికెట్లు పడుతున్న వేళ.. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ లక్నో బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. కేవలం 51 బంతుల్లోనే 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రింకూ సింగ్ ఒంటరి పోరాటం వల్లే కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగుల పోరాట స్కోరును సాధించగలిగింది.
ఐపీఎల్ 2026 తొలి సూపర్ ఓవర్ హీరో
మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగి 'టై' కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సీజన్‌లో ఇదే మొదటి సూపర్ ఓవర్ కావడం విశేషం. ఒత్తిడి పతాక స్థాయికి చేరిన వేళ రింకూ సింగ్ మళ్లీ బ్యాట్ అందుకున్నాడు. సూపర్ ఓవర్‌లో అద్భుతమైన ఫోర్ కొట్టి జట్టు విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తూ అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న రింకూ సింగ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications