న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆకాశ్‌ చోప్రా వరల్డ్‌ ఎలెవన్‌లో బుమ్రాకు చోటు.. రోహిత్‌, కోహ్లీలకు షాక్!!

Babar Azam in, Virat Kohli out? Premier pacer Jasprit Bumrah only Indian in Aakash Chopras World T20I XI

ఢిల్లీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆస్ట‌న్ అగ‌ర్, దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్ ప్ర‌పంచ అత్యుత్త‌మ క్రికెట్ జ‌ట్టును ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా చేరాడు.

Rohit Sharma Irked By Fans | We Are Indians, Will Talk In Hindi Only

కరోనా ఎఫెక్ట్.. ఉమ్మితో బంతిని శుభ్రం చేయడాన్ని నిషేధించిన ఆస్ట్రేలియా!!కరోనా ఎఫెక్ట్.. ఉమ్మితో బంతిని శుభ్రం చేయడాన్ని నిషేధించిన ఆస్ట్రేలియా!!

ఓపెనర్లుగా వార్నర్, బట్లర్‌:

ఓపెనర్లుగా వార్నర్, బట్లర్‌:

ఆకాశ్‌ చోప్రా ఎంపిక చేసిన అత్యుత్తమ టీ20 వరల్డ్‌ ఎలెవన్‌లో టీమిండియా నుంచి పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రాకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మలకు అవకాశం దక్కలేదు. ప్రతీ దేశం నుంచి తలో క్రికెటర్‌ను ఎంచుకున్న ఆకాశ్‌ చోప్రా.. భారత ప్రస్తుత క్రికెట్‌ జట్టు నుంచి బుమ్రాకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఓపెనర్లుగా ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌లను తీసుకున్నాడు.‌ రోహిత్‌ శర్మకు మాత్రం చోటివ్వలేదు.

మూడో స్థానంలో కొలిన్‌ మున్రో:

మూడో స్థానంలో కొలిన్‌ మున్రో:

మూడో స్థానంలో న్యూజిలాండ్‌ హార్డ్‌ హిట్టర్‌ కొలిన్‌ మున్రోను ఆకాశ్‌ చోప్రా ఎంపిక చేశాడు. నాలుగో స్థానంలో పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌, బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌, వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ను వరుస స్థానాల్లో తీసుకున్నాడు. షకీబుల్‌, రసెల్‌లు అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ ఆప్షన్‌లుగా చోప్రా తీసుకున్నాడు.

స్పిన్నర్ల కోటాలో రషీద్‌ ఖాన్, సందీప్‌ లామ్‌చెన్‌:

స్పిన్నర్ల కోటాలో రషీద్‌ ఖాన్, సందీప్‌ లామ్‌చెన్‌:

ఇక స్పిన్నర్ల కోటాలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, నేపాల్‌ లెగ్‌ స్పిన్నర్‌ సందీప్‌ లామ్‌చెన్‌లను ఆకాశ్‌ చోప్రా తన అత్యుత్తమ టీ20 వరల్డ్‌ ఎలెవన్‌లో చోటిచ్చాడు. పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌లో బుమ్రాతో పాటు శ్రీలంక దిగ్గజ బౌలర్‌ లసిత్‌ మలింగాలకు అవకాశం కల్పించాడు. భారత బ్యాటింగ్‌ విభాగంలో ఏ ఒక్క టీమిండియా క్రికెటర్‌కి చోప్రా అవకాశం ఇవ్వలేదు. కోహ్లీ, రోహిత్‌లను పరిశీలనలోకి తీసుకున్నా.. వారికి ఏ స్థానాల్లో చోటివ్వాలో తెలియలేదన్నాడు.

జట్టును ఎంపిక చేయడానికి చాలా కసరత్తు చేశా:

జట్టును ఎంపిక చేయడానికి చాలా కసరత్తు చేశా:

కేవలం ఒక భారత క్రికెటర్‌ను మాత్రమే తీసుకోవడంతో బుమ్రాకు చోటిచ్చా అని చోప్రా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి వీడియో సందేశంలో మాట్లాడిన చోప్రా.. ఈ అత్యుత్తమ టీ20 వరల్డ్‌ ఎలెవన్‌ జట్టును ఎంపిక చేయడానికి చాలా కసరత్తు చేసినట్లు తెలిపాడు. ఇది తనకు చాలెంజ్‌గా మారినప్పటికీ చివరకు మంచి జట్టునే ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఇది తన టీమ్‌ అంటూ ప్రకటించిన చోప్రా.. మీ అత్యుత్తమ టీ20 జట్టును కూడా ప్రకటించాలని పేస్‌బుక్‌లో అభిమానుల్ని కోరాడు.

చోప్రా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు:

చోప్రా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు:

డేవిడ్‌ వార్నర్, జోస్‌ బట్లర్, కొలిన్‌ మున్రో, బాబర్‌ అజామ్‌, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌,‌ ఆండ్రీ రసెల్, రషీద్‌ ఖాన్‌,‌ సందీప్‌ లామ్‌చెన్‌, జస్ప్రీత్ బుమ్రా లసిత్‌ మలింగా.

Story first published: Saturday, May 2, 2020, 12:32 [IST]
Other articles published on May 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X