న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత మహిళల జట్టు ఇంగితజ్ఞానం లేకుండా ఆడిందంటూ అజారుద్దీన్ ట్వీట్.. ఓ రేంజులో అజార్‌పై నెటిజన్ల ఫైర్

Azharuddin controversy Tweet Goes Viral, Netizes Slams Azhar for His Irrespectful Tweet

బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో భారత వుమెన్స్ క్రికెట్ టీం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. త్రుటిలో ఈ మ్యాచ్ చేజారింది. తద్వారా గోల్డ్ దక్కాల్సింది.. రజత పతకంతో సరిపెట్టుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అసాధారణ రీతిలో 65పరుగులు చేసి పోరాడినా అది జట్టు విజయానికి సరిపోలేదు.

భారత్ 162పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 9పరుగుల తేడాతో గెలుపుకు మిస్సయింది. చివర్లో ప్లేయర్లు ఒత్తిడికి గురవ్వడంతో 152పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆఖరి ఓవర్‌లో భారత్‌కు 11పరుగులు అవసరమైన దశలో రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు చేజార్చుకున్న ఇండియా పోరాటాన్ని ముగించింది. ఓటమి అంచుల్లో నుంచి ఆస్ట్రేలియా అద్వితీయంగా పుంజుకుని బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

వుమెన్స్ టీం చెత్త బ్యాటింగ్

ఇకపోతే భారత వుమెన్స్ జట్టు ఫైనల్లో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి రావడం పట్ల మాజీ భారత మెన్స్ టీం కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర కామెంట్లు చేశాడు. జట్టు ప్రదర్శనను నిందించాడు. 'ఇండియా వుమెన్స్ టీం చెత్త బ్యాటింగ్. ఇంగితజ్ఞానం లేకుండా ఆడారు. గెలుపొందిన గేమ్‌ను కంచెంలో తీసుకెళ్లి ప్రత్యర్థికి అప్పగించారు' అని ట్వీట్ చేశాడు. ఇక వుమెన్స్ టీం ప్రదర్శనను అతను తీవ్రంగా విమర్శించడం పట్ల నెటిజన్ల నుంచి ప్రతివిమర్శలతో ట్వీట్లు పోటెత్తాయి. సపోర్ట్ చేయడం చేతకాదు కాని విమర్శించడం మాత్రం వచ్చు అంటూ చాలా మంది నెటిజన్లు నెట్టింట ట్వీట్లతో అజారుద్దీన్‌పై విరుచుకుపడుతున్నారు.

ఓసారి చూసుకుని కామెంట్ చేయాలి

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా జట్టు పోరాటానికి అభిమానులు మద్దతు తెలిపారు. భారత జట్టునుద్దేశించి కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేసినందుకు అజారుద్దీన్‌ను నిందిస్తూ ట్వీట్లు చేశారు. ఇక అజారుద్దీన్ ట్వీట్ వైరల్ అయ్యింది. అతను ఆడే రోజుల్లో ఆస్ట్రేలియన్ టీంకు వ్యతిరేకంగా అతను సాధించిన విజయాలేంటో ఓసారి చూసుకుని కామెంట్ చేయాల్సిందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ 90లలో అజారుద్దీన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న టైంలో టీమిండియ పేలవ ప్రదర్శనను ఎత్తి చూపాడు.

కనీసం మంచి భాషను ప్రయోగించాల్సింది

ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ ఈవెంట్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నందుకు వుమెన్స్ జట్టును అభినందించాల్సింది పోయి ఈ నిందలేంటీ బాసు.. కనీసం మంచి భాషను అయినా ప్రయోగించాల్సిందంటూ ఓ నెటిజన్ అజార్‌కు హితవు పలికాడు. మహిళల జట్టు పట్ల గౌరవంగా వ్యవహరించాలని, బాగా ఆడినప్పుడు ఒక్కసారి కూడా మెచ్చుకోని వ్యక్తికి ఇప్పుడు మాత్రం విమర్శించే హక్కు కూడా లేదంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇకపోతే గత ఆరేళ్లలో భారత మహిళల జట్టు మూడు పెద్ద ఈవెంట్లలో ఫైనల్స్‌లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచింది. చివర్లో ఒత్తిడిని ఎదుర్కోలేక విఫలమవుతుంది. ఏదేమైనా బీసీసీఐ వుమెన్స్ టీం తమకున్న తక్కువ వనరుల్లోనే ఎంతో మెరుగ్గా ఆడిందనేది జగమెరిగిన సత్యం.

Story first published: Tuesday, August 9, 2022, 21:31 [IST]
Other articles published on Aug 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X