న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్ఫరాజ్‌పై వేటు: టెస్టు కెప్టెన్‌గా అజహర్ అలీ, టీ20లకు బాబర్ ఆజాం

 Azhar Ali to lead Pakistan in Tests, Babar Azam appointed T20I captain; Sarfaraz Ahmed sacked

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత కొంతకాలంగా పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోన్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై బోర్డు వేటు వేసింది. టెస్టుల్లో కెప్టెన్‌గా అజహర్ అలీని నియమించగా... టీ20లకు యువ బ్యాట్స్‌మెన్ బాబర్ అజాంను నియమించింది.

అయితే, వన్డేలకు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌తో పాటు స్వదేశంలో శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో పాకిస్థాన్ జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

రాంచీ టెస్టులో డుప్లెసిస్ కీలక నిర్ణయం: తనకు బదులు వేరొకరిని!రాంచీ టెస్టులో డుప్లెసిస్ కీలక నిర్ణయం: తనకు బదులు వేరొకరిని!

ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించాలని హెడ్ కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ గట్టిగా పట్టుబట్టాడు. 2010లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అజహర్ అలీ పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాడిగా మారాడు.

34 ఏళ్ల అజహర్ అలీ పాకిస్థాన్ తరుపున 73 టెస్టులాడి 5,669 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016-17లో పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో అజహర్ అలీ(5, 71, 205 not out, 43, 71 and 11) అద్భుత ప్రదర్శన చేశాడు.

ఆ తర్వాత తటస్థ వేదిక అయిన యూఏఈ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన టెస్టు సిరిస్‌లలో 16, 42, 30, 51, 53, 30, 109, 100 not out, 18, 4, 15 and 64 ఫరవాలేదనిపించాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న అజహర్ అలీ ఆస్ట్రేలియాపై వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 938 పరుగులు చేశాడు.

India vs South Africa: రాంచీ టెస్ట్ మ్యాచ్‌కు ధోనీ.. స్టేడియానికి పోటెత్తనున్న అభిమానులు!!India vs South Africa: రాంచీ టెస్ట్ మ్యాచ్‌కు ధోనీ.. స్టేడియానికి పోటెత్తనున్న అభిమానులు!!

నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ టోర్నీ అయిన క్వయిద్-ఇ-అజాం ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అజహర్ అలీ(388) రెండో స్థానంలో ఉన్నాడు. అజహర్ అలీ ప్రాతినిథ్యం వహిస్తోన్న సెంట్రల్ పంజాబ్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించింది.

ఇక, టీ20 కెప్టెన్ బాబర్ అజాం విషయానికి వస్తే ప్రస్తుతం టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2012లో ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా బాబర్ అజాం సేవలందించాడు. ఇటీవలే స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్వవహారించాడు.

ప్రస్తుతం పాక్‌లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో బాబర్ అజాం సెంట్రల్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. సింధ్ జట్టుతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో బాబర్ అజాం 59 బంతుల్లో 102 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.

Story first published: Friday, October 18, 2019, 15:10 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X