న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్, యాషెస్‌కు ముందు స్ఫూర్తి కోసం యుద్ధ భూమికి ఆసీస్ జట్టు

Australian Team to Visit WW1 Battlegrounds Ahead of World Cup & Ashes

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ టెస్టు సిరిస్ జరగనుంది. మొత్తంగా నాలుగు నెలల సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు శనివారం పయనమైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు గత యాషెస్ టెస్టు సిరిస్‌లోనూ ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. దాంతో రెండు ప్రతిష్టాత్మక ట్రోఫీలను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న ఆరోన్‌ ఫించ్‌ సేన టర్కీలోని 'గాలిపోలి' సమర భూమి నుంచి స్ఫూర్తి పొందాలనుకుంటోంది.

వరల్డ్‌కప్‌‌కు ముందు

వరల్డ్‌కప్‌‌కు ముందు

ఇందులో భాగంగా ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొదటి ప్రపంచ యుద్ధానికి వేదికగా నిలిచిన గలిపోలి ప్రాంతానికి కంగారూ జట్టు బయల్దేరింది. మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా ఆటొమన్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన గాలిపోలి సమరంలో మిత్రపక్షాల తరపున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు బరిలోకి వేల సంఖ్యలో తమ సైనికులను నష్టపోయాయి.

గలిపోలి ప్రాంతంలో శిక్షణ కార్యక్రమాల్లో

గలిపోలి ప్రాంతంలో శిక్షణ కార్యక్రమాల్లో

ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆస్ట్రేలియాలో విమానం ఎక్కిన జట్టు సభ్యులు టర్కీలో దిగారు. కొన్ని రోజుల పాటు గలిపోలి ప్రాంతంలోనే ఉండి శిక్షణ కార్యక్రమాల్లో ఆస్ట్రేలియా జట్టు పాల్గొనబోతోంది. లక్షల మంది సైనికులు భీకరంగా తలపడ్డ ఈ ప్రాంతంలో ఉండి.. అప్పటి పరిస్థితుల గురించి తెలుసుకుంటే జట్టు సభ్యుల్లో స్ఫూర్తి రగులుతుందని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు.

లార్డ్స్‌లో ఫైనల్

లార్డ్స్‌లో ఫైనల్

లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన పద్దతిలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టు టోర్నీలోని మిగతా జట్లతో తలపడనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

వరల్డ్‌కప్‌లో తలపడే ఆస్ట్రేలియా

వరల్డ్‌కప్‌లో తలపడే ఆస్ట్రేలియా

ఆరోన్ ఫించ్(కెప్టెన్), బెహ్రాన్‌డ్రాఫ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయాన్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్ సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

Story first published: Sunday, May 12, 2019, 11:07 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X