న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్!

Australian cricketer Cameron White announces retirement from all forms of cricket

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కామెరాన్ వైట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపిన కామెరాన్.. కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనుకుంటున్నట్లు తన మనసులోని కోరికను వెల్లడించాడు.'నా ఆటకు ముగింపు పలుకుతున్నాను. స్ట్రైకర్స్‌తో నేను ఓ ఏడాది ఒప్పందం చేసుకున్నా. కానీ గతేడాది ఆ జట్టు తరఫున కొన్ని మ్యాచ్‌లే ఆడాను. మరోసారి ఆ జట్టులోఆడాలంటే బాగా రాణించాలి. కానీ నేను ఆటకు ముగింపు పలికే సమయం వచ్చిందనుకుంటున్నా. ఆటగాడిగా నాకు సరిపోయింది. కోచింగ్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నా'అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్ క్రికెట్. కామ్ ఏయూకు తెలిపాడు.

ఆస్ట్రేలియా తరఫున 91 వన్డేలు, 47 టీ20లు, 4 టెస్ట్‌లు ఆడిన కామెరాన్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇక టెస్ట్‌ల్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2008 భారత పర్యటనలో ఆడినవే. వన్డేల్లో 2072, టీ20ల్లో 984, టెస్టుల్లో 146 పరుగులు చేసిన ఈ ఆసీస్ ప్లేయర్.. మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో 2007-12 మధ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జెస్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. 2013లో సన్‌రైజర్స్ తరఫున ఆడాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున 2018లో ఇంగ్లండ్‌పై చివరి వన్డే ఆడిన కామెరాన్.. నిలకడలేమి ఫామ్‌తో జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్‌లో రఫ్ఫాడించిన వైట్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10వేల రన్స్‌తో పాటు 195 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 7700 రన్స్‌తో 100కు పైగా వికెట్లను తనఖాతాలో వేసుకున్నాడు. 10 డొమెస్టిక్ ట్రోఫీలు గెలుచుకున్న వైట్.. 6 షెఫీల్డ్ షీల్డ్స్, డొమెస్టి వన్డే క్రౌన్‌తో పాటు ఓల్డ్ స్టేట్ టీ20 లీగ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ ట్రోఫీ విజేతగా కూడా నిలిచాడు. ఓవరాల్‌గా 240 టీ20 మ్యాచ్‌లు ఆడిన వైట్ 5469 రన్స్‌తో 708 వికెట్లు తీశాడు.

<strong>రైనా.. అఫ్రిదిలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకో: ఆకాష్ చోప్రా</strong>రైనా.. అఫ్రిదిలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకో: ఆకాష్ చోప్రా

Story first published: Friday, August 21, 2020, 16:18 [IST]
Other articles published on Aug 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X