న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే అభ్యంతరమేమీ లేదు.. అతనికి సహకరిస్తా: ఆసీస్ కెప్టెన్

Australian captain Tim Paine support Steve Smiths Return to Captaincy

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే అభ్యంతరమేమీ లేదు. నేను అతనికి సహకరిస్తా అని ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. యాషెష్ 2019తో మళ్లీ పునరాగమనం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో అర్ధ సెంచరీ, నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీ, ఐదవ టెస్టులో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు.

ఐసీసీకి గంగూలీ వార్నింగ్.. బీసీసీఐకి దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందే!!ఐసీసీకి గంగూలీ వార్నింగ్.. బీసీసీఐకి దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందే!!

స్మిత్ యాషెస్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. పునరాగమనం చేసినప్పటికీ కెప్టెన్సీ పదవికి మాత్రం దక్కలేదు. అయితే యాషెస్‌ సిరీస్‌లో విశేషంగా రాణించడంతో స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చింది. స్మిత్‌ నాయకత్వ సామర్థ్యాన్ని ఆసీస్‌ హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసించాడు. స్మిత్‌ మంచి కెప్టెన్‌ అని కొనియాడాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా స్మిత్‌కు అండగా నిలిచాడు.

హెడ్ కోచ్‌ లాంగర్‌ మాటలతో స్మిత్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ఖాయం అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రస్తుతం ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ స్పందించాడు. 'ప్రస్తుతం ఆసీస్‌ కెప్టెన్సీ పదవిని ఆస్వాదిస్తున్నా. ఏదొక రోజు స్మిత్‌ మళ్లీ పగ్గాలు చేపడుతాడనే నేను ఆశిస్తున్నా. స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే నాకు అభ్యంతరమేమీ లేదు. స్మిత్‌ కెప్టెన్సీకి అన్ని విధాలా సహకరిస్తా' అని అన్నాడు

కెప్టెన్సీ కోసం బీబీఎల్‌ను వదిలేస్తున్నా అని యాషెస్‌ టెస్ట్ సిరీస్ అనంతరం పైన్‌ అన్నాడు. 'ఆసీస్‌ తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటం చాలా ముఖ్యం. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా. ఇందుకోసం బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)ను వదిలేయాలని నిర్ణయించుకున్నా. టెస్టు కెరీర్‌ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో ఆడుతా. ఒక కెప్టెన్‌గా నాకొచ్చి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటా. ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే' అని పైన్‌ పేర్కొన్నాడు. ఇప్పుడేమో స్మిత్‌ కెప్టెన్సీకి సహకరిస్తా అని అంటున్నాడు అంటే.. పైన్‌కు సారథ్యం వదులుకోవడం ఇష్టం లేదని స్పష్టమయింది.

Story first published: Tuesday, October 15, 2019, 13:48 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X