న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైరింగ్‌లో అలీమ్‌ దార్‌ అరుదైన ఘనత.. స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు!!

Australia vs New Zealand: Aleem Dar breaks Steve Bucknors record for most Tests as umpire

పెర్త్‌: క్రికెట్ ఆటలో బ్యాట్స్‌మన్‌, బౌలర్, ఫీల్డర్‌లు మాత్రమే కాదు అంపైర్‌లు కూడా రికార్డులు బద్దలు కొడుతున్నారు. పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఓ అరుదైన ఘనతను తన పేరుపై లికించుకున్నారు. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును అలీమ్‌ దార్‌ సొంతం చేసుకున్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా చేయడంతో అలీమ్‌ దార్‌ ఈ రికార్డును అందుకున్నారు.

విలియమ్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌.. కోహ్లీ రియాక్షన్‌ అదుర్స్ (వీడియో)!!విలియమ్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌.. కోహ్లీ రియాక్షన్‌ అదుర్స్ (వీడియో)!!

స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు:

స్టీవ్‌ బక్నర్‌ రికార్డు బద్దలు:

అలీమ్‌ దార్‌ ఇప్పటికే 128 టెస్టు మ్యాచ్‌లకు అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. గురువారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం అయింది. ఇది అలీమ్‌ దార్‌కు 129వ టెస్టు మ్యాచ్‌. దీంతో వెస్టిండీస్‌ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌ (128) పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్‌ రికార్డును అలీమ్‌ దార్‌ బద్దలు కొట్టారు.

2003లో కెరీర్‌ ఆరంభం:

2003లో కెరీర్‌ ఆరంభం:

పాకిస్తాన్‌లో దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన 51 ఏళ్ల అలీమ్‌ దార్‌.. దేశం తరపున మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలీమ్‌ తన అంపైరింగ్‌ కెరీర్‌ను 2003లో ప్రారంభించారు. ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్‌ అలీమ్‌కు మొదటిది. తన కెరీర్‌లో 207 వన్డేలకు, 46 టీ20లకు అంపైర్‌గా పనిచేసారు. 1989-2009 మధ్య కాలంలో స్టీవ్‌ బక్నర్‌ 128 టెస్టులు, 181 వన్డేలకు అంపైర్‌గా పని చేశారు.

ఎన్నో ఘనతలు చూశా:

ఎన్నో ఘనతలు చూశా:

అలీమ్‌ దార్‌ వన్డేల్లో అంపైరింగ్‌ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా మూడు మ్యాచ్‌ల దూరంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్టెజన్‌ 209 వన్డేలకు అంపైర్‌గా చేసి అగ్ర స్థానంలో ఉన్నారు. మ్యాచ్ ముందు అలీమ్‌ దార్‌ మాట్లాడుతూ... 'చాలా సంతోషంగా ఉంది. ఈ రికార్డు సాధిస్తానని అనుకోలేదు. ఇది నా కెరీర్‌లో ఒక మైలురాయి. ఇన్నేళ్లలో ఎన్నో ఘనతలు చూశా. బ్రియాన్‌ లారా 400 పరుగులు, 434 పరుగుల వన్డే లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజింగ్‌ చేయడం చూశా' అని తెలిపారు.

Story first published: Thursday, December 12, 2019, 14:13 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X