న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారా సెంచరీ: అడిలైడ్ టెస్టులో తొలిరోజు నమోదైన గణాంకాలివే

Australia vs India, 2018-19: 1st Test, Day 1 – Statistical Highlights

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా (123) సెంచరీతో చెలరేగడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహమ్మద్ షమీ(6), జస్ప్రీత్ బుమ్రా (0) పరుగులతో ఉన్నారు.

<strong>పోటీపడి మరీ వికెట్లు: భారత బ్యాట్స్‌మెన్ షాట్ సెలక్షన్‌పై మండిపడ్డ సన్నీ</strong>పోటీపడి మరీ వికెట్లు: భారత బ్యాట్స్‌మెన్ షాట్ సెలక్షన్‌పై మండిపడ్డ సన్నీ

భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లీ(3), ఓపెనర్లు మురళీ విజయ్(11), కేఎల్ రాహుల్(2), రహానే(13) నిరాశపరిచినా... తొలిరోజు రోజంతా పట్టుదలతో 85.5 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన పుజారా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లలో లియాన్, హజెల్‌వుడ్, కమ్మిన్స్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. అద్భుతమైన ఆటతో క్రీజులో నిలిచిన పుజారా 231 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 16వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై మూడోది కావడం విశేషం. తాజా సెంచరీతో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ టెస్టు సెంచరీతో పుజారా టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

అడిలైడ్ టెస్టులో తొలిరోజు నమోదైన గణాంకాలు:

 తొలి రోజున సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్

తొలి రోజున సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్

1 - ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టు సిరిస్‌లో ఆరంభ మ్యాచ్‌ తొలి రోజున సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా. మొత్తంగా చూస్తే ఉపఖండం బయట ఓ టెస్టు సిరిస్‌లో తొలిరోజు సెంచరీ సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు.

6 - ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో కనీసం ఒక సెంచరీ సాధించిన ఆరో భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా నిలిచాడు. అంతకముందు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఉన్నారు.

 మూడో అత్యధిక స్కోరు

మూడో అత్యధిక స్కోరు

123 - అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై పుజారా చేసిన 123 పరుగులు ఓపెనింగ్ డే రోజున ప్రత్యర్ధి జట్టుపై మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ జాబితాలో వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1960లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో సోబర్స్ తొలిరోజున (132) పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన మార్సీ లేలాండ్(126) ఉన్నాడు.

108 - టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి పుజారాకు పట్టిన ఇన్నింగ్స్. ఈ మైలురాయిని అందుకున్న ఐదో భారత ఆటగాడిగా పుజారా నిలిచాడు. అడిలైడ్ టెస్టులో పుజారా సెంచరీ సాధించడంతో ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లో 14000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్

41 - ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటి సెషన్‌లో 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ టెస్టు సిరిస్‌లో తొలిరోజే ఇలా జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఓ టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు టీమిండియా అతి తక్కువ పరుగులకే అంటే 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 1962లో వెస్టిండిస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఈ స్కోరుని నమోదు చేసింది.

3 - అడిలైడ్ ఓవల్‌లో రోహిత్ శర్మ ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ అతడిని పెవిలియన్‌కు చేర్చడం విశేషం. సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ శర్మను నాథన్ లియాన్ నాలుగు సార్లు ఔట్ చేయడం విశేషం.

ఆస్ట్రేలియా గడ్డపై సెహ్వాగ్ సిక్సుల రికార్డుని సమం చేసిన రోహిత్

ఆస్ట్రేలియా గడ్డపై సెహ్వాగ్ సిక్సుల రికార్డుని సమం చేసిన రోహిత్

8 - ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో రోహిత్ శర్మ బాదిన సిక్సుల సంఖ్య. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెహ్వాగ్ కూడా ఎనిమిది సిక్సులు బాదాడు.

Story first published: Thursday, December 6, 2018, 17:22 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X