బెన్ స్టోక్స్‌కు విసుగు తెప్పించండి: అభిమానులకు స్టార్క్ సలహా

Posted By:

హైదరాబాద్: తప్పతాగి ఓ వ్యక్తిపై పిడిగుద్దులు గుప్పించిన కేసులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు సిరీస్‌ జట్టు నుంచి బెన్ స్టోక్స్‌ను ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు బెన్ స్టోక్స్ స్ధానంలో స్టీవెన్‌ ఫిన్‌కు చోటు కల్పించారు.

అక్టోబర్ 26వ తేదీ రాత్రి బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌ బయట స్టోక్స్‌ మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులతో తీవ్రంగా గొడవపడి బెన్‌స్టోక్స్ అరెస్టయిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే అతను ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు. స్టోక్స్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతనిపై వేటు కొనసాగుతుందని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.

Australia vs England: Mitchell Starc Urges Aussie Fans To 'Get Stuck Into' Ben Stokes

ఇదిలా ఉంటే, ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న బెన్ స్టోక్స్ యాషెస్ సిరిస్‌కు దూరం కావడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశమే. ఈ విషయాన్ని ఇప్పటికే ఆసీస్ మాజీ క్రికెటర్లు ఇయాన్ చాపెల్ లాంటి వారు సైతం అంగీకరించారు. స్టోక్స్ లేకపోతే యాషెస్ సిరీస్‌ను తీసుకెళ్లడం ఇంగ్లాండ్ వల్ల కాదంటూ చాపెల్ సెటైర్లు కూడా వేశాడు.

తాజాగా బెన్ స్టోక్స్‌పై ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. పనిలో పనిగా స్టోక్స్‌ను వేధించమంటూ ఆసీస్ అభిమానులకు సలహా కూడా ఇచ్చాడు. 'యాషెస్ సిరీస్‌కు స్టోక్స్ దూరంగా ఉంటాడనే అనుకుంటున్నా. ఒకవేళ ఆసీస్ పర్యటనకు స్టోక్స్ చివరి నిమిషంలో వస్తే అతన్ని ఆసీస్ అభిమానులు అదే పనిగా వేధించండి' స్టార్క్ అన్నాడు.

'గట్టిగా అరుస్తూ స్టోక్స్‌కు విసుగు తెప్పించండి. అతను ఆడితే స్టేడియం నుంచే వచ్చే అరుపుల్ని వినాలని ఆసక్తిగా ఉంది. ఒకవేళ స్టోక్స్ యాషెస్‌లో పాల్గొంటే అక్కడ అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రతికూల వాతావరణం ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఏది ఏమైనా యాషెస్ సిరీస్ సాఫీగానే సాగుతుందని అనుకుంటున్నా' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 10, 2017, 20:00 [IST]
Other articles published on Oct 10, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి