న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టు జట్టులోకి తీసుకోవడం రోహిత్‌కు బలం తీసుకొచ్చింది'

Australia Test call-up has boosted Rohit Sharmas confidence: Sourav Ganguly

హైదరాబాద్: భారత టెస్టు జట్టులోకి రోహిత్ శర్మని సెలక్టర్లు ఎంపిక చేయడంతో అతడిలో విశ్వాసం రెట్టింపైందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాలో ఎంపిక చేస్తే టెస్టు ఫార్మాట్‌లో ఆడేందుకైనా తాను సిద్ధంగా ఉన్నాననే రోహిత్ కల నెరవేరింది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు భారీ సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు.

టెస్టు జట్టులోకి సెలక్టర్ల నుంచి పిలుపు

టెస్టు జట్టులోకి సెలక్టర్ల నుంచి పిలుపు

ఆస్ట్రేలియాతో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టులాడిన రోహిత్ శర్మ.. పేలవ ఫామ్ కారణంగా ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. కానీ.. ఇటీవల ఆసియా కప్, వెస్టిండీస్‌తో సిరీస్‌లో సెంచరీలు సాధించి.. మళ్లీ టెస్టు జట్టులోకి సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు.

బ్యాక్‌ఫుట్‌పై ఆడటం రోహిత్ శర్మ బలం..

బ్యాక్‌ఫుట్‌పై ఆడటం రోహిత్ శర్మ బలం..

వన్డే, టీ20ల్లో తన పవరేంటో..? రోహిత్ శర్మ మరోసారి సెలక్టర్లకి తెలియజెప్పాడు. ఆసియా కప్, వెస్టిండీస్‌తో అతని స్కోర్లు చూశాక.. కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపికవుతాడని ఊహించా. ఇప్పుడు టెస్టు జట్టులోకి మళ్లీ ఎంపికవడంతో రోహిత్ శర్మలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపై ఉంటుంది. గతంతో పోలిస్తే.. అతని షాట్ సెలక్షన్ కూడా ఇటీవల మెరుగైంది. బ్యాక్‌ఫుట్‌పై ఆడటం రోహిత్ శర్మ బలం.. ఆసీస్ పిచ్‌లపై అతని ఆట చక్కగా సరిపోతుంది.

మొదట బ్యాట్స్‌మెన్‌ని.. బాధ్యతలను పూర్తిగా

మొదట బ్యాట్స్‌మెన్‌ని.. బాధ్యతలను పూర్తిగా

టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయంపై రోహిత్‌ స్పందిస్తూ... ‘మొదట నేను బ్యాట్స్‌మెన్‌ని. ఇతర బాధ్యతలను నేను పూర్తిగా ఉల్లాసవంతంగా నిర్వర్తిస్తున్నాను. కెప్టెన్‌గా ఉండడం నా కెరీర్‌కి ఉపయోగపడింది. జట్టుకి ఉపయోగపడేలా ఆటగాళ్లలో ఒకరిగా ఉంటున్నాను. భారత జట్టులోనే కాదు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా బాధ్యతలను ఎంతో ఉల్లాసవంతంగా నిర్వహిస్తున్నాను. ప్రస్తుత మా ప్రత్యర్థి వెస్టిండీస్‌ చాలా క్లిష్టమైన‌ జట్టు. టీ20ల్లో వారు చాలా బలంగా ఉంటారు. ' అని రోహిత్‌ చెప్పాడు. ‌ ‌

Story first published: Sunday, November 4, 2018, 16:56 [IST]
Other articles published on Nov 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X