న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్...

ICC Cricket World Cup 2019: David Warner Injured Ahead Of World Cup Match!! | Oneindia Telugu
Australia have a nervous day ahead as they sweat on David Warners fitness

ప్రపంచకప్‌ 2019 అసలు సమరానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచుకు వార్నర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఓ ప్రకటనలో తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

డేవిడ్‌ వార్నర్‌

డేవిడ్‌ వార్నర్‌

డేవిడ్‌ వార్నర్‌ రెండవ ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. వార్నర్‌ కుడి తొంటిలో గాయమైంది. దీంతో శ్రీలకంతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ ఆడలేదు. ఇక బుధవారం ఆసీస్ నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా వార్నర్‌ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో గురువారం వార్నర్‌కు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించగా.. అతను అన్‌ఫిట్‌ అని తేలినట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌కు వార్నర్‌ దూరమయ్యే అవకాశం ఉంది.

వార్నర్‌ కుడి తొంటిలో గాయమైంది

వార్నర్‌ కుడి తొంటిలో గాయమైంది

'వార్నర్‌ కుడి తొంటిలో గాయమైంది, నొప్పి కారణంగా వార్నర్‌ ఇబ్బంది పడుతున్నాడని' ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మీడియాకు సమాచారం ఇచ్చాడు. 'వార్నర్‌​ టోర్నీలో 15 మంది ఆటగాళ్లకు అవకాశం రావాలని కోరుకుంటాడని' జస్టిన్‌ తెలిపాడు. వార్నర్ గాయంతో ఎలా ముందుకు వెళ్లాలో వ్యూహాలు రచిస్తున్నామని ఆయన తెలిపాడు.

తలనొప్పిగా మారనుంది

తలనొప్పిగా మారనుంది

అయితే వార్నర్‌ తొలి మ్యాచ్ కల్లా కోలుకోకపోతే తుది జట్టు ఎంపిక ఆసీస్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఓ పెద్ద తలనొప్పిగా మారనుంది. శ్రీలంకతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో వార్నర్‌ గైర్హాజరితో ఉస్మాన్‌ ఖవాజా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఈ మ్యాచులో ఖవాజా గాయపడ్డ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. అయితే మెగా టోర్నీలో కీలక ఆటగాడు దూరమవడం ఆసీస్ జట్టును కలవరపెడుతోంది. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్న వార్నర్‌.. ఐపీఎల్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, May 31, 2019, 13:11 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X